Asianet News TeluguAsianet News Telugu

జెఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై కాల్పులు, తప్పిన ప్రాణాపాయం

న్యూఢిల్లీలోని జవహార్‌‌లాల్ నెహ్రు యూనివర్శిటీ విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై  సోమవారం నాడు కాల్పులు జరిగాయి. హై సెక్యూరిటీ జోన్‌లో ఈ కాల్పులు చోటు చేసుకొన్నాయి.

JNU Student Umar Khalid Shot At In Delhi High-Security Zone, Unhurt
Author
New Delhi, First Published Aug 13, 2018, 3:51 PM IST


న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని జవహార్‌‌లాల్ నెహ్రు యూనివర్శిటీ విద్యార్థి ఉమర్ ఖలీద్‌పై  సోమవారం నాడు కాల్పులు జరిగాయి. హై సెక్యూరిటీ జోన్‌లో ఈ కాల్పులు చోటు చేసుకొన్నాయి.  ఈ ఘటనలో ఉమర్ ఖలీద్ ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు. ఖలీద్‌పై కాల్పులకు దిగిన దుండగుడు పారిపోయాడు.

జెఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖలీద్  సెంట్రల్ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకొంది.  ఖలీద్‌ను లక్ష్యంగా చేసుకొని దుండగులు కాల్పులు జరిపారు. అయితే కాల్పులను పసిగట్టిన ఖలీద్  తప్పించుకొన్నాడు.  

దుండగుడు కాల్పులు జరుపుతున్న విషయాన్ని గుర్తంచిన ఖలీద్ చివరి నిమిషంలో  కిందకు వంగిపోయాడు.  ఆ సమయంలో  మా మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఆ సమయంలో  ఖలీద్ కిందపడిపోయాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

 

 

తామంతా టీ స్టాల్ వద్ద టీ తాగుతున్న సమయంలో ఖలీద్ ను లక్ష్యంగా చేసుకొన్న ఓ దుండగుడు తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించినట్టు  ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఖలీద్ తప్పించుకొన్నాడు. 

నిందితుడిని పట్టుకొనేందుకు తాము ప్రయత్నించగా నిందితుడు పారిపోయినట్టు చెప్పారు. అయితే  నిందితుడు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకొన్నట్టు  ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios