జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు విలఫం చేశారు. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి 6 కిలోల ఐఈడీ స్వాధీనం చేసుకున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయడంలో పోలీసులు ఘనవిజయం సాధించారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి, అతడి నుంచి 6 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED)ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు ప్రకటించారు. అరెస్టు చేసిన వ్యక్తిని ఇష్ఫాక్‌ అహ్మద్‌ వానీ అని, పుల్వామాలోని అరిగ్రామ్‌ ప్రాంత వాసిగా గుర్తించారు. 

మరో వైపు భద్రతా బలగాలు ఉత్తర కశ్మీర్ లో భద్రతను కట్టిదిట్టం చేశాయి. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు నిఘా కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో G20 సమావేశానికి ముందు భద్రతా బలగాల వాహనాలపై IEDలను ఉపయోగించాల్సి ఉన్నందున పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ మేరకు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఉగ్రవాదుల హతం

గత ఐదురోజులుగా వివిధ ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదాలను బలగాలు హతం చేశారు. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్‌కు చెందిన వారిగా గుర్తించారు. అలాగే.. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా శనివారం (మే 06) జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఉగ్రవాది హతమయ్యాడు. అదే సమయంలో శుక్రవారం (మే 5) వనిగం పయిన్ ప్రాంతంలో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు హతమైన ఎన్‌కౌంటర్ జరిగింది.

కర్హమా గ్రామంలో ఉగ్రవాదుల ఉనికి గురించిన నిర్దిష్ట సమాచారం మేరకు పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని ఏరియా ఎస్‌ఎస్‌పి బారాముల్లా, అమోద్ నాగ్‌పురే తెలిపారు. ఆ తరుణంలో ఎన్‌కౌంటర్‌ మొదలైంది. సెర్చ్ అపరేషన్ ప్రారంభమైన వెంటనే కాల్పులు ప్రారంభమయ్యాయని, అందులో ఒక ఉగ్రవాది మరణించాడని పోలీసులు తెలిపారు. హతమైన ఉగ్రవాదిని యార్‌హోల్ బాబాపోరా కుల్గాం నివాసి అబిద్ వనిగా గుర్తించినట్లు ఎస్‌ఎస్పీ తెలిపారు.