తాను ప్రజలకు సేవ చేయడం కోసమే బీజేపీలోకి వచ్చానని.. అమిత్ షాతో తనకు ఎలాంటి ఒప్పందం కుదరలేదంటూ కాంగ్రెస్ మాజీ నేత జీతిన్ ప్రసాద చెప్పినప్పటికీ.. ఆయనకు ముందుగానే హామీ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆయనకు యోగి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కనుంది అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

తాను ప్రజలకు సేవ చేయడం కోసమే బీజేపీలోకి వచ్చానని.. అమిత్ షాతో తనకు ఎలాంటి ఒప్పందం కుదరలేదంటూ కాంగ్రెస్ మాజీ నేత జీతిన్ ప్రసాద చెప్పినప్పటికీ.. ఆయనకు ముందుగానే హామీ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆయనకు యోగి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కనుంది అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీని ప్రకారం అతి త్వరలోనే జితిన్ ప్రసాద యోగి కేబినెట్‌లో చేరబోతున్నారట.

ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి నేరుగా మంత్రి పదవి అప్పజెబుతారని టాక్. ఈ మేరకు హైకమాండ్ ఆదేశాలతో సీఎం యోగి ఆదిత్యనాధ్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సమాచారం. జూలైలో యూపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. ఇందులో ఒక స్థానాన్ని బీజేపీ అధిష్ఠానం జితిన్ ప్రసాదకు కేటాయించనుంది. సీఎం యోగి బ్రాహ్మణులను తన పాలనలో నిర్లక్ష్యం చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Also Read:అమిత్ షాతో ఏ డీలూ చేసుకోలేదు, కాంగ్రెస్‌ను వీడిన కారణమిదే: జీతిన్ ప్రసాద

ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే జితిన్ ప్రసాదకు మంత్రి బాధ్యతలు అప్పజెబితే, బ్రాహ్మణుల ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా ఉంటుందని బీజేపీ పెద్దల ఆలోచన. మరి జితిన్ ప్రసాదకు మంత్రిగా బెర్త్ కన్ఫర్మ్ అయ్యిందో.. లేక ఇది గాలి వార్తో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.