జియో కష్టమర్లకు బంపర్ ఆఫర్

ప్రముఖ టెలికాం సంస్థ రిలయెన్స్ జియో మరో సూపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పెతో కలిసి ఈ ఆఫర్‌ను కష్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. రూ.399 రీచార్జ్‌తో రూ.50 క్యాష్‌బ్యాక్ వస్తుంది. హాలీడే హంగామా పేరుతో వస్తున్న ఈ ఆఫర్ జూన్ 1 నుంచి జూన్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. మైజియో యాప్ ద్వారా మాత్రమే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ ఫోన్‌పె ద్వారా చేస్తేనే ఈ క్యాష్‌బ్యాక్ వస్తుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దీంతోపాటు జియో అందిస్తున్న రూ.50 డిస్కౌంట్ వోచర్లు కూడా కస్టమర్లకు వస్తాయి. రూ.399 ప్లాన్ కింద 84 రోజుల పాటు రోజూ 1.5 జీబీ 4జీ డేటా, వంద ఎస్సెమ్మెస్, అన్‌లిమిటెడ్ వాయిల్ కాల్స్ వస్తాయన్న విషయం తెలిసిందే. శనివారం నుంచీ ఈ ఆఫర్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. జియో రెండు రోజుల కిందటే సామ్‌సంగ్ గెలాక్సీ జే2, గెలాక్సీ జే7 ప్రొ స్మార్ట్‌ఫోన్లపై రూ.2750 వరకు క్యాష్‌బ్యాక్ ప్రకటించిన విషయం తెలిసిందే.