ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్లో నిన్న అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. తాజాగా, జియో నెట్‌వర్క్ కూడా డౌన్ అయింది. చాలా మంది యూజర్లు ట్విట్టర్‌లో తమ ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరికి ఈ రోజు ఉదయం నుంచి సమస్య తలెత్తినట్టు తెలిసింది. ఇంకొందరు జియో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ సేవలూ డౌన్ అయ్యాయని వివరించారు. 

న్యూఢిల్లీ: ఇంటర్నెట్, సెల్యూలర్ నెట్‌వర్క్‌ సేవలు నిత్యజీవితంలో ఒక భాగమయ్యాయి. అందుకే కాసేపు network సేవలు నిలిచిపోతే తీవ్ర ప్రభావం వేస్తున్నాయి. నిన్న ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా jio network నెట్‌వర్క్ కూడా డౌన్ అయింది. కనీసం రెండున్నర గంటల నుంచి Reliance Jio Down అయినట్టు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రెండున్నర గంటలుగా జియో నెట్‌వర్క్ నో సర్వీస్ అని చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏకంగా Twitterలో ట్రెండింగ్ కూడా నడిచింది.

Scroll to load tweet…

కొంత మంది యూజర్లు తమ జియో నెట్‌వర్క్ ఉదయం నుంచి పనిచేయడం లేదని ఫిర్యాదు చేయగా, ఇంకొందరు జియో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌దీ అదే పరిస్థితి అని వివరించారు. నెట్‌వర్క్ సేవలను డౌన్ డిటెక్టర్ పర్యవేక్షిస్తుంటుంది. దీని ప్రకారం, జియో ప్రస్తుతం నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొంటున్నది. కనీసం నాలుగు వేల మంది జియో నెట్‌వర్క్‌పై ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాలు సహా ఢిల్లీ, బెంగళూరు, ఇతర కొన్ని నగరాల్లో ఈ సమస్య ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా తెలుస్తున్నది.

Scroll to load tweet…

రిలయన్స్ జియో అధికారిక కస్టమర్ సపోర్ట్ హ్యాండిల్‌లో నెట్‌వర్క్ రావడం లేదని ట్విట్టర్ యూజర్లు ఫిర్యాదులతో పోటెత్తుతున్నారు. దీనిపై జియో కేర్ స్పందించింది. యూజర్లకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని పేర్కొంది. ఇంటర్నెట్ సేవలు వినియోగించడంలో లేదా కాల్స్/ఎస్ఎంఎస్ సేవలు వినియోగించుకునేటప్పుడు సాధారణంగా అప్పుడప్పుడు కలిగే సమస్యే ఇది అని వివరించింది. ఇది తాత్కాలికమైన సమస్య అని తెలిపింది. వీలైనంత త్వరగా పరిష్కరించడానికి తమ బృందం పనిచేస్తున్నట్టు పేర్కొంది.