ప్రేమికులన్నాక.. అలకలు సర్వసాధారణం. ప్రియురాలు అలక పాన్పు ఎక్కితే.. ప్రియుడు నయానో, భయానో నచ్చచెప్పుకుంటాడు. లేదా ఏదైనా బహుమతి ఇచ్చి బ్రతిమిలాడుకుంటాడు. కానీ ఓ ప్రియుడు మాత్రం కోపంతో స్కూటీకి నిప్పు అంటించాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Also Read బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఆరుగురు మృతి...

పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక విల్లివాక్కం జగన్నాథన్‌ వీధిలోని ఓ ఇంటి ప్రాంగణంలో పార్కింగ్‌ చేసిన ద్విచక్రవాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీనిపై బాధితులు రాజమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. 

అదే ప్రాంతానికి చెందిన రాజేష్‌ (24) అనే యువకుడు ద్విచక్రవాహనానికి నిప్పంటించడం ఫుటేజీలో కనిపించింది. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, గత మూడు నెలలుగా ఆమె మాట్లాడక పోవడంతో ఆమె వాహనానికి, ఆమె తండ్రి వాహనానికి నిప్పంటించినట్లు అంగీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి పోలీసులు విచారణ చేపట్టారు.