Asianet News TeluguAsianet News Telugu

భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో ఎదురుకాల్పులు.. ఇద్ద‌రు మావోయిస్టులు హ‌తం

జార్ఖండ్: మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా, జార్ఖండ్ జాగ్వార్, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం సెరైకెలా-ఖర్సవాన్, చైబాసా, ఖుంటి జిల్లాల ట్రై జంక్షన్‌లో దాడులు నిర్వహించింది.
 

Jharkhand : Two Maoists killed in gun battle with security forces
Author
First Published Sep 3, 2022, 2:40 AM IST

మావోయిస్టులు: జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సవాన్ జిల్లాలో శుక్రవారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సీఆర్పీఎఫ్ కు చెందిన‌ కోబ్రా, జార్ఖండ్ జాగ్వార్, రాష్ట్ర పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో మావోయిస్టులు మరణించారని వెల్ల‌డించారు. "కుచాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరుడా ఫారెస్ట్‌లో జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు మావోయిస్ట్ సభ్యులు హతమయ్యారు" అని కోల్హాన్ డివిజన్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అజయ్ లిండా పీటిఐకి తెలిపారు. మృతదేహాలను, వారి వ‌ద్ద ఉన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. చివరి నివేదిక అందే సరికి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని తెలిపారు.

"మావోయిస్ట్‌లు తమ శిబిరం వద్దకు భద్రతా బలగాలు వస్తున్నారని గుర్తించిన వెంటనే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది సంయుక్త బృందం ఎదురు కాల్పులు జ‌రిపింది. కొన్ని గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి" అని జార్ఖండ్ పోలీసు ప్రతినిధి, ఐజీ-ఆపరేషన్స్ అమోల్ వి హోల్మ్‌కర్ తెలిపారు. సెక్షన్ కమాండర్లు కలి ముండా, రీలా మాలాగా గుర్తించబడిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు, మరికొందరు గాయపడినట్లు అనుమానిస్తున్నట్లు హోల్మ్‌కర్ తెలిపారు. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రాంతం నుండి ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి, వైర్‌లెస్ సెట్లు, టెంట్లు-ఇతర వస్తువులు, లైవ్ కాట్రిడ్జ్‌లతో పాటు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అనల్ డా బృందం చాలా కాలంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, వారికి మరియు పోలీసు బలగాలకు కూడా హాని కలిగిస్తుందని సీనియర్ అధికారి చెప్పారు.

అలాగే,  అనాల్ దా బృందం చాలాకాలంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, వారికి, పోలీసు దళానికి కూడా హాని కలిగిస్తోందని సీనియర్ అధికారి తెలిపారు.  "అతని బృందం గణనీయమైన నష్టాన్ని చవిచూడటం ఇదే మొదటిసారి. నక్సల్స్‌పై నిరంతరాయంగా ప్రచారం నిర్వహిస్తున్న జార్ఖండ్ పోలీసులకు ఇది భారీ విజయం" అని ఫోర్స్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

ఇదిలావుండ‌గా, తెలంగాణ‌లో కూడా మావోయిస్టులు క‌ద‌లిక‌లు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయ‌ని పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టులు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ రాష్ట్రంలోకి చొరబడ్డారని.. కొన్ని సమావేశాలు నిర్వహించడం ద్వారా లేదా 'పోలీస్ ఇన్‌ఫార్మర్‌లను' చంపడం ద్వారా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ క్ర‌మంలోనే భూపాలపల్లి పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) జె సురేందర్ రెడ్డి చట్టవిరుద్ధమైన మావోయిస్టుల ముఖ్య నాయకుల తలపై నగదు బహుమతి వివరాలతో పోస్టర్లను విడుదల చేశారు. పోలీసు ఇన్‌ఫార్మర్లుగా ముద్రవేసి అమాయకులను చంపేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మావోయిస్టులు అడ్డుకుంటున్నారని, మావోయిస్టుల కదలికలపై సమాచారం అందించిన వారికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రివార్డు ఇస్తామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో 10 మంది మావోయిస్టులు సంచరిస్తున్నట్లు తమకు సమాచారముందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios