జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలోని రోప్‌వే కేబుల్ కార్ ప్రమాద ఘటనకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు 40 గంటలకు పైగా కేబుల్ కార్లలో గాలిలో చిక్కుపోయిన 40 మందికి పైగా ప్రజలను రెస్క్యూ ఆపరేషన్ ద్వారా రక్షించారు.
జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలోని రోప్‌వే కేబుల్ కార్ ప్రమాద ఘటనకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు 40 గంటలకు పైగా కేబుల్ కార్లలో గాలిలో చిక్కుపోయిన 40 మందికి పైగా ప్రజలను రెస్క్యూ ఆపరేషన్ ద్వారా రక్షించారు. ఈ రెస్క్యూ రెండు వైమానిక దళ హెలికాప్టర్‌లతో పాటుగా పదుల సంఖ్యలో అధికారులు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంయుక్త బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని డియోఘర్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ తెలిపారు.
అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఇందులో ఓ మహిళ గాయాలతో మరణించింది. మరో ఇద్దరు(ఓ మహిళ, ఓ పురుషుడు) హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మరణించారు. ఇక, ఈ కేబుల్ కార్లను ఓ ప్రైవేట్ కంపెనీ నడుపుతుందని.. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఆపరేటర్లు అక్కడి నుంచి పారిపోయారని జిల్లా యంత్రాంగం తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణాలను ఇంకా నిర్ధారించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై జార్ఖండ్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ అంశంపై ఏప్రిల్ 26న విచారణ చేపట్టనున్న కోర్టు పేర్కొంది. ఈలోపు ప్రమాదంపై సమగ్ర విచారణ నివేదికను అఫిడవిట్ ద్వారా దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇక, ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. రెస్క్యూ ఆపరేషన్‌పై ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్ గవర్నర్ Ramesh Bais స్పందిస్తూ.. ‘‘ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధార్మిక ప్రదేశమైన డియోఘర్‌లోని త్రికూట్ పర్వతంపై నిర్మించిన రోప్‌వేపై జరిగిన ప్రమాదం చాలా బాధాకరమైనది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని బాబా బైద్యనాథ్‌ను ప్రార్థిస్తున్నాను’’ అని తెలిపారు.
అసలేం జరిగిందంటే..
జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలోని బాబా బైద్యనాథ్ ఆలయానికి సమీపంలోని త్రికూట్ కొండల వద్ద రోప్‌వే కేబుల్ కార్‌లలో ఆదివారం సాయంత్రం ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సాంకేతిక లోపం కారణంగా రెండు కేబుల్ కార్లు ఢీకొనండతో కేబుల్ కార్లన్నీ గాలిలోనే నిలిచిపోయాయి. దీంతో కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా బయటకు తీసుకురావడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక, కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించడానికి భారత వైమానిక దళం సోమవారం రంగంలోకి దిగింది. సోమవారం కొందరికి రక్షించగా.. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత రెస్క్యూ కార్యకలాపాలు నిలిపివేయవలసి వచ్చింది. ఈ రోజు ఉదయం మళ్లీ రెస్యూ ఆపరేషన్‌ను ప్రారంభించి.. మిగిలిన వారిని రక్షించారు.
