రాంచీ: అదృశ్యమైన 45 ఏళ్ల  మహిళ శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా పూడ్చిపెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని పకూర్ జిల్లాలో ఈ ఘటన సోమవారం నాడు వెలుగు చూసింది.

పకూర్ జిల్లాలోని నది ఒడ్డున మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా దొరకడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన సోనా మారాండీ అదృశ్యమైంది. నది ఒడ్డున దొరికిన శరీర బాగాలు అదృశ్యమైన సోనావిగా గుర్తించారు.

సోనా స్వగ్రామానికి చెందిన సమీపంలో మనిషి కాలును స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలంలో తవ్వారు. మూడు గంటల తర్వాత ఓ మహిళ కాళ్లు, చేతులు, తల, మొండెం ఇతర శరీర భాగాలు లభ్యమయ్యాయి.

సోనా కొడుకును పిలిపించి పోలీసులు శరీర బాగాలను చూపారు. ఆ శరీరబాగాలు తన తల్లివిగా ఆయన తెలిపారు. తన తల్లి ఆచూకీ కోసం సోనా కొడుకు మనోజ్ ఈ నెల 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వెలికితీసిన శరీరబాగాలను పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించారు. ఆ మహిళను ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.సోనాను అత్యంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే విషయమై కుటుంబసభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.