రాంచీ: తన భార్య కలను నెరవేర్చేందుకుగాను జార్ఖండ్ కు చెందిన  ఓ వ్యక్తి 1100 కిలోమీటర్లు టూ వీలర్ పై ప్రయాణించారు.

జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా సిటీకి చెందిన ధనుంజయ్ కుమార్ 10వ తరగతి వరకు చదువుకొన్నాడు. అతని వయస్సు. ఆయన ప్రస్తుతం వంట మనిషిగా పనిచేస్తున్నాడు.

ధనుంజయ్ భార్య సోని హేబ్రహం వయస్సు 24 ఏళ్లు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సులో చేరింది.గొడ్డా నుండి గ్వాలియర్ సిటీకి వెళ్లేందుకు 1,100 కిలోమీటర్లను బైక్ పై ప్రయాణం చేశారు. గూగుల్ మ్యాప్ ను ఉపయోగించి కొన్ని షార్ట్ కట్ ద్వారా ఆయన బైక్ పై ప్రయాణం చేశాడు.

జార్ఖండ్ రాష్ట్రంలో కంటే  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఫీజు తక్కువ ఉన్న కారణంగా ఇక్కడే కోర్సులో చేరినట్టుగా ధనుంజయ్ ప్రకటించారు.రైళ్లు లేని కారణంగా పరీక్షలు రాసేందుకు తన భార్య సోనిని తీసుకొని గొడ్డా నుండి గ్వాలియర్ కు బైక్ పై వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేశారు.

గ్వాలియర్ వెళ్లడానికి ఓ కారును అద్దెకు తీసుకొంటే రూ. 30 వేలు చెల్లించాల్సిన పరిస్థితులు చెల్లించాలి.. దీంతో తాను పరీక్ష రాయనని సోని చెప్పింది. కానీ తన భార్య సోనితో పరీక్ష రాయించాలని  ధనుంజయ్ ఆగష్టు 27వ తేదీన నిర్ణయం తీసుకొన్నాడు. 

కరోనా నేపథ్యంలో గత నాలుగు నెలలుగా ఆయన ఉద్యోగం చేయడం లేదు. దీంతో తన బంధువుల వద్ద రూ. 10 వేలను అప్పుగా తీసుకొన్నాడు. బైక్ పెట్రోల్ ఖర్చుతో పాటు ఇతర అవసరాలకు వీటిని ఉపయోగించుకోవాలని ఆయన భావించాడు.బీహార్ లోని ముజఫర్ పూర్ నుండి లక్నో మీదుగా గ్వాలియర్ కు బైక్ పై ఆగష్టు 30వ తేదీన చేరుకొన్నారు.

గ్వాలియర్ లోని డీడీ నగర్ లో రూమ్ ను రూ. 1500లకు అద్దెకు తీసుకొన్నట్టుగా ధనుంజయ్ చెప్పాడు.  ఇప్పటికే  రూ. 7  వేలను ఖర్చు చేసినట్టుగా ఆయన చెప్పాడు. మరో వైపు తన భార్య ఆరు నెలల గర్భవతి అని ధనుంజయ్ చెప్పాడు.

తమ ఇంటికి తిరిగి వెళ్లడానికి తమ వద్ద రూ. 3 వేలు ఉన్నాయని ఆయన చెప్పారు. తన కలను నిజం చేసేందుకు తన భర్త ప్రయత్నించడంపై ఆమె సంతోషంతో ఉన్నారు.