టీచర్ తల నరికి.. ఆ తలతోనే ఊరంతా తిరిగాడు

First Published 4, Jul 2018, 11:50 AM IST
JHARKHAND: Man Kills Teacher, Runs Around With Her Head For 2 Hours Before Arrest
Highlights

మతిస్థిమితం లేని వ్యక్తి నిర్వాకం.. 

మతిస్థిమితం లేని వ్యక్తి.. ఓ టీచర్ తల నరికేశాడు. అంతటితో ఆగకుండా.. ఆమె తలపట్టుకొని దాదాపు 2గంటలపాటు ఊర్లో తిరిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు చివరికి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సుక్రూ హెస్సా అనే 30 ఏళ్ల మహిళ సెరైకేలా ఖర్సావాన్ జిల్లా ఖప్సారాయ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా  పనిచేస్తోంది. మతిస్థిమితం లేని హరి హెంబ్రోం(26)  ఎప్పుడూ ఆమెవైపు అదోలా చూసేవాడు. మంగళవారం అతడు స్కూలు వద్దకు వెళ్లి.. ఆమెను బయటికి రావాలని అరచి కేకలేశారు. సుక్రూ పట్టించుకోలేదు. దీంతో హరి.. స్కూల్లోకి చొరబడి ఆమెను బయటకు ఈడ్చుకొచ్చాడు.

 తర్వాత ఆమెపై కత్తితో దాడి చేశాడు.తలను ఖండించి, చేత్తో పట్టుకుని అరుస్తూ తిరిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. జంషెడ్‌¡పూర్‌కు చెందిన సుక్రూ ఖప్సారాయ్ గ్రామానికి బదిలీ అయ్యాక మొదట్లో హరి కుటుంబానికి చెందిన ఇంట్లో అద్దెకుండేదని, అతని ప్రవర్తన నచ్చక ఇటీవలే వేరే ఇంటికి మారిందని, అందుకే అతడు చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

loader