రాంచీ:  జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ జవాన్ మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఆదివారం నాడు ఉదయం జార్ఖండ్ రాష్ట్రంలోని  ఢంకాలో మావోలు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటు చేసుకొంది.రెండు వర్గాలు పరస్పరం కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి  చెందాడు. 

నలుగురు మావోయిస్టులు చనిపోయారు.  ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో భద్రతా బలగాలు కూంబింగ్‌ను పెద్ద ఎత్తున చేపట్టాయి.