అరుదైన జబ్బుతో బాధపడుతున్న ఓ మహిళ.. మంగళసూత్రం, గాజులు, ఇనుప మేకులు మింగేసింది. కాగా.. ఆమెకు శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులోని వాటిని వైద్యులు తొలగించారు. ఈ సంఘటన అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది

పూర్తి వివరాల్లోకి వెళితే... అహ్మదాబాద్ కి చెందిన సంగీత(40) అనే మహిళ.. ‘ఆక్యుఫాగియా’ అనే అరుదైన జబ్బుతో బాధపడుతోంది. ఈ వ్యాధిగల వారికి మెటల్ వస్తువులు తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతుందట. అది ఈ జబ్బు లక్షణమని వైద్యులు తెలిపారు.

కాగా.. ఇటీవల ఆమె తన మెడలోని మంగళసూత్రం, చేతి గాజులు, ఇనుపమేకులు, నట్లు, బోల్టులు, సేఫ్టీ పిన్నులు, హెయిర్ పిన్నులు, బ్రేస్ లెట్, చైన్లు, రాగి ఉంగరం తినేసింది. అయితే.. పిచ్చిపట్టి అలా చేస్తోందని భావించిన కుటుంబసభ్యులు ఆమెను మెంటల్ ఆస్పత్రికి తరలించారు.

కాగా.. అక్కడ ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా.. సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆమె కడుపులో కిలోన్నరకు పైగా ఇనుప వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు చెప్పారు.