న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బీ) కుంభకోణం కేసు నిందితుడు, వజ్రాల వ్యాపారి ఎట్టకేలకు చిక్కాడు. క్యూబాకు పారిపోతుండగా డొమినకలో అతను చిక్కినట్లు తెలు్తోంది. మెహుల్ చోక్సీ ఈ వారం ప్రారంభంలో కరేబియా దేశం ఆంటిగ్వా, బార్పుడాలో అదృశ్యమయ్యారు. 

మెహుల్ చోక్సీ 2018లో ఆటిగ్వా, బార్పూడాకు భారతదేశం నుంచి పారిపోయాడు. సిబిఐ మెహుల్ చోక్సీ తన అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. 

మెహుల్ చోక్సీ కరేబియాలోని అతి చిన్న ద్వీపం డొమినకాకు పడవలో చేరుకున్నట్లు తెలుస్తోంది. అతనిపై లుకవుట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో స్థానిక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను వారి కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అతన్ని ఆంటిగ్వాకు అప్పగించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అతని జాడ తెలిసినట్లు సిబిఐకి, ఈడీకి సమాచారం అందింది. అతన్ని త్వరలోనే భారత్ కు అప్పగిస్తారని ెలుస్ోతంది. 

తమ దేశం నుంచి మెహుల్ చోక్సీ పారిపోయినట్లు తమకు సమాచారం లేదని ఆంటిగ్వా ప్రధాని గాస్తోన్ బ్రౌన్ అంతకు ముందు చెప్పారు. అతను కనిపించడం లేదని కుటుంబ సభ్యుల్లో ఒకరు చెప్పడంతో గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి.