Asianet News TeluguAsianet News Telugu

జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

గతేడాది రాత్రి 9గంటలకు మొయిన్ ర్యాంకులను ప్రకటించిన ఎన్టీఏ ఈ సారి ఆలస్యంగా వెల్లడించింది. ప్రాథమిక కీ పై అభ్యంతరాలకు గడువు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5గంటలకు ముగిసింది. 

JEE Mains Results Out, 24 Students Score 100 Percentile
Author
Hyderabad, First Published Sep 12, 2020, 7:37 AM IST

జేఈఈ మొయిన్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభను చాటారు.  దేశవ్యాప్తంగా 24మంది 100 పర్సంటైల్ స్కోర్ సాధించగా.. వారిలో తెలుగు విద్యార్థులే 11మంది ఉండటం గమనార్హం.

ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు ఎనిమిది మంది 100శాతం మార్కులు సాధించి తమ సత్తా చూపించారు. శుక్రవారం రాత్రి 11గంటల తర్వాత టాపర్ల జాబితాను జాతీయ పరీక్షల మండలి విడుదల చేసింది. ర్యాంకులను మాత్రం 11.45 గంటల వరకు ప్రకటించలేదు. ఈ నెల 27న జరిగే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష రాసేందుకు వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 2.50లక్షల మందికి అవకాశం కల్పిస్తారు.

కాగా.. గతేడాది రాత్రి 9గంటలకు మొయిన్ ర్యాంకులను ప్రకటించిన ఎన్టీఏ ఈ సారి ఆలస్యంగా వెల్లడించింది. ప్రాథమిక కీ పై అభ్యంతరాలకు గడువు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5గంటలకు ముగిసింది. 

ఇదిలా ఉండగా.. జేఈఈ మొయిన్స్ లో సత్తాచాటిన విద్యార్థులు వీరే..

తెలంగాణ..
1. చాగరి కౌశల్ కుమార్ రెడ్డి, 2. చుక్కా తనూజ, 3. దీప్తి చశశ్చంద్ర, 4.ఎం. లిఖిత్ రెడ్డి. 5. రాచపల్లి శశాంక్ అనిరుధ్, 6. ఆర్. అరుణ్ సిద్ధార్థ్, 7. సాగి శివకృష్ణ, 8. వాడపల్లి అర్వింద్ నరసింహా

ఆంధ్రప్రదేశ్..
1. లండా జితేంద్ర, 2. తడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్, 3. వైఎస్ఎస్ నరసింహ నాయుడు


 

Follow Us:
Download App:
  • android
  • ios