జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1 ఫలితాలు విడుదల అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రోజు ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్టుగా తెలిపింది.
జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1 ఫలితాలు విడుదల అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ రోజు ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్టుగా తెలిపింది. జెఈఈ మెయిన్ సెషన్ 1కు హాజరైన అభ్యర్థులు వారి స్కోర్‌ను.. jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా సత్తా చాటారు. తెలంగాణకు చెందిన యశ్వంత్, ఏపీకి చెందిన ఆదినారాయణ పి, కే సహాస్, పి రవిశంకర్.. వంద పర్సంటైల్ సాధించారు.
ఇక, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 23 నుంచి 29 వరకు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE మెయిన్) 2022ని నిర్వహించింది. నేడు ఫలితాలను వెల్లడించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. సబ్జెక్ట్ వారీగా మార్కులు, మొత్తం మార్కులు, పర్సంటైల్.. తదితర వివరాలను చెక్ చేసుకోవచ్చు.
ఇక, జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు IIT JEE Advancedకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జేఈఈ మెయిన్‌లో టాప్‌లో నిలిచిన 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో హాజరుకావచ్చు. అయితే ఇప్పుడు సెషన్ 1 ఫలితాలను మాత్రమే ఎన్‌టీఏ ప్రకటించింది. సెషన్ 2 పరీక్ష తర్వాత అభ్యర్థుల ర్యాంక్‌లు ప్రకటించబడతాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. JEE మెయిన్స్ సెషన్ 2 పరీక్షను జూలై 21 నుంచి నిర్వహిస్తుంది. ఆ తర్వాత తుది ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటించబడతాయి. IIT JEE అడ్వాన్స్‌డ్ 2022ను ఆగస్టు 28 నిర్వహించబడుతుంది. ఈ ఏడాది ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహించనుంది.
