Asianet News TeluguAsianet News Telugu

జేఈఈ మొయిన్స్ .. అదరగొట్టిన తెలుగు విద్యార్థులు..!

 వీరిలో తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇద్దరు..  ఆంధ్రప్రదేశ్ కి చెందిన విద్యార్థులు నలుగురు ఉండటం విశేషం. కాగా.. మొత్తం 9,34,602 మంది విద్యార్థులుఈ జేఈఈ  మెయిన్స్‌ పరీక్ష రాశారు.
 

JEE Main Result 2021: 44 Candidates Score 100 Percentile, 18 Share Top Rank
Author
Hyderabad, First Published Sep 15, 2021, 8:22 AM IST

జేఈఈ మొయిన్స్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి.  నాలుగో విడుత ఫలితాలను మంగళవారం అర్థరాత్రి విడుదల చేశారు. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. కాగా.. ఈ ఫలితాలలో దాదాపు 44 మంది అభ్యర్థులు 100శాతం సాధించడం గమనార్హం. కాగా.. వారిలో 18మందికి ఫస్ట్ ర్యాంకు రావడం గమనార్హం.

కాగా.. వీరిలో తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇద్దరు..  ఆంధ్రప్రదేశ్ కి చెందిన విద్యార్థులు నలుగురు ఉండటం విశేషం. కాగా.. మొత్తం 9,34,602 మంది విద్యార్థులుఈ జేఈఈ  మెయిన్స్‌ పరీక్ష రాశారు.

 తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొమ్మ శ‌ర‌ణ్య‌, జోస్యూల వెంకట ఆదిత్య ఫస్ట్‌ ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుగ్గినేని వెంక‌ట‌ ప‌నీష్‌, ప‌స‌ల వీర‌శివ‌, కుంచ‌న‌ప‌ల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేష్ మొదటి ర్యాంక్‌ సాధించిన వారిలో ఉన్నారు. 

జేఈఈ మెయిన్ నాలుగో విడుత పరీక్షను ఆగస్టు​ 26, 27, 31, సెప్టెంబర్​ 1, 2 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 334 కేంద్రాల్లో 13 భాషల్లో (తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, గుజరాతి, అస్సామీస్‌, బెంగాలి, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళం) నిర్వహించారు. జేఈఈ మెయిన్​ సెషన్​ 4ను ఆగస్టు​ 26, 27, 31, సెప్టెంబర్​ 1, 2 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా ఉన్న 334 ఎగ్జామ్​ సెంటర్లలో జరిగింది.

అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in, DigiLocker లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
దీనిలో ప్రధాన ఫలితం, NTA స్కోర్ కార్డ్ కూడా అందుబాటులో ఉంటుంది.
పరీక్ష నాల్గవ సెషన్‌ను ఎంచుకొని.. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే ఫలితం కనిపిస్తుంది.
అనంతరం స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి.

కాగా.. జేఈఈ మెయిన్ పరీక్షలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరు కావడం ఇదే మొదటిసారి. సెషన్ 4 కోసం మొత్తం 7.32 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సెషన్ 1 లో, మొత్తం 6.61 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. సెషన్ 2, 6.19 లక్షల మంది, సెషన్ 3 లో, 7.09 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా 13 భాషలలో నిర్వహిస్తారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios