దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం విద్యారంగంపై గట్టిగానే పడింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇంటర్, టెన్త్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అలాగే సీబీఎస్‌ఈ సిలబస్‌ కింద జరిగే ఇంటర్ పరీక్షలు వాయిదా పడగా.. టెన్త్ పరీక్షలు రద్దయ్యాయి. ఇక పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్‌ను సైతం కేంద్రం నాలుగు నెలలు వాయిదా వేసింది. తాజాగా ఇంజనీరింగ్ విద్యార్ధులకు అత్యంత కీలకమైన జేఈఈ మెయిన్స్ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.