Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: జేఈఈ అడ్వాన్స్ పరీక్ష వాయిదా

జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఐఐటీ ఖరగ్‌పూర్  బుధవారం నాడు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఆ సంస్థ తెలిపింది. 

JEE Advance 2021 postponed due to COVID-19 surge; revised dates to be announced later lns
Author
New Delhi, First Published May 26, 2021, 3:26 PM IST

న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఐఐటీ ఖరగ్‌పూర్  బుధవారం నాడు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఆ సంస్థ తెలిపింది. ఈ ఏడాది జూలై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.  కరోనా పరిస్థితులను సమీక్షించిన మీదట పరీక్షల తేదీని తర్వాత ప్రకటించనున్నట్టుగా అధికారులు తెలిపారు.

కరోనాతో  పలు రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలను రద్దు చేశారు. కొన్ని రాష్ట్రాలు బోర్డు పరీక్షలను రద్దు చేసింది. సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ పరీక్షలను రద్దు చేసింది. పలు యూనివర్శిటీలు కూడ సెమిస్టర్ పరీక్షలను కూడ వాయిదా వేశాయి.  యూపీఎస్‌సీ సివిల్స్ పరీక్షలను కూడ వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

దేశంలో కరోనా నేపథ్యంలో  చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గున్నాయి. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు కొంచెం పెరిగాయి. నిన్న రెండు లక్షలలోపు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ మాత్రం రెండు లక్షలు దాటాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios