తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మృతి కేసు దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. డిసెంబర్ 5, 2016లో జయలలిత.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె చనిపోయిన నాటి నుంచి కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

తాజాగా  హాస్పటిల్ రికార్డు ఇవ్వాల్సిందిగా అధికారులు హాస్పిటల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. దీంతో.. దీనిపై అపోలో హాస్పిటల్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. అక్కడ హాస్పిటల్ యజమాన్యం పెట్టుకున్న పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది.

దీంతో.. వారు ఈ సారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని న్యాయస్థానం.. హాస్పిటల్ పెట్టుకున్న పిటిషన్ ని పరిశీలించింది. అనంతరం దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది.