సమాజ్‌వాదీ పార్టీ నేత అజాం ఖాన్‌ తనపై చేసిన ఆరోపణలను తలచుకుని ఆమె బోరున విలపించారు. తనను రామ్‌పూర్‌ నుంచి వెళ్లిపోవాలంటూ అజాం ఖాన్ డిమాండ్‌ చేస్తున్నారని స్పష్టం చేశారు. లేకపోతే యాసిడ్‌ దాడులు చేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆమె ఏడ్చేశారు. దీంతో పక్కనే ఉన్న బీజేపీ నేతలు ఆమెను ఓదార్చారు. 

రామ్‌పూర్‌: ప్రముఖ నటి, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి జయప్రద కన్నీటి పర్యంతమయ్యారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె ఎన్నికల ప్రచారంలో బోరున విలపించారు. తన పుట్టిన రోజు కానుకగా బీజేపీ రామ్‌పూర్‌ టికెట్‌ను బహుమతిగా ఇచ్చిందని చెప్పుకొచ్చారు. 

టికెట్ ఇచ్చి మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని తెలిపారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ నేత అజాం ఖాన్‌ తనపై చేసిన ఆరోపణలను తలచుకుని ఆమె బోరున విలపించారు. తనను రామ్‌పూర్‌ నుంచి వెళ్లిపోవాలంటూ అజాం ఖాన్ డిమాండ్‌ చేస్తున్నారని స్పష్టం చేశారు. 

లేకపోతే యాసిడ్‌ దాడులు చేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆమె ఏడ్చేశారు. దీంతో పక్కనే ఉన్న బీజేపీ నేతలు ఆమెను ఓదార్చారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు జయప్రదకు మద్దతుగా ఉంటామని వారు ప్రతిజ్ఞ చేశారు. తొలిసారి తన వెనుక బీజేపీ బలం ఉందన్నార. 

ఇకపై తాను ఏడవాలనుకోవడం లేదన్నారు. తనకు బతికేహక్కుంది. బతుకుతాను కూడా. ఎవ్వరు నన్నేమీ చేయలేరు అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. తాను బీజేపీలో చేరతానంటే కొందరు హెచ్చరించారని కానీ ప్రజా సేవ చేసేందుకు బీజేపీయే మంచి పార్టీ అని తనకు అనిపించిందన్నారు జయప్రద. 

రాబోయే ఎన్నికల్లో తాను గెలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇమ్మని దేవుడిని కోరుకుంటున్నాని అలాగే మీ ఆశీర్వాదం కూడా ఇవ్వాలంటూ జయప్రద ప్రజలన కోరారు. 

Scroll to load tweet…