ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ జవాన్ దారుణ హత్యకు గురయ్యాడు. జవాన్ బోదరాస్‌లో జాతర చూసుకునేందుకు వచ్చిన సమయంలో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. 

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ జవాన్ దారుణ హత్యకు గురయ్యాడు. జవాన్ బోదరాస్‌లో జాతర చూసుకునేందుకు వచ్చిన సమయంలో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. వివరాలు.. హత్యకు గురైన జవాన్ సుక్మా జిల్లా కుకనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోదరస్ ప్రాంతానికి చెందినవాడు. అతడు జాతర చూసేందుకు బోదరస్ వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. అయితే శనివారం జవాన్ హత్యకు గురయ్యాడని తెలిపారు. మావోయిస్టులే ఈ దారుణానికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకన్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ మనీష్ మిశ్రా ఘటన స్థలాన్ని సందర్శించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.