హోలీ వేడుకల్లో జపానీస్ యువతిపై రంగుల దాడి.. ఎవరినీ విడిచిపెట్టనంటున్న స్వాతి మలివాల్..  వీడియో వైరల్    

హోలీ వేడుకల సందర్భంగా ఢిల్లీలో కొంతమంది యువకులు జపాన్‌కు చెందిన ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Japanese Woman Tweets On Holi Incident After Leaving India

దేశ రాజధాని ఢిల్లీలోని పహర్‌గండ్ ప్రాంతంలో హోలీ రోజున ఓ అవమానకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. జపాన్ నుంచి భారత్ కు వచ్చిన ఓ విదేశీ మహిళను వేధించడమే కాకుండా.. ఆమెపై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు.ఆ యువతి అనుమతి లేకుండా ఆమెకు బలవంతంగా రంగు పూయడంతో పాటు.. ఆమె తలపై కోడి గుడ్లు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో ద్వారా ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మైనర్ అని చెప్పారు. బాధిత మహిళ భారత్‌ను విడిచిపెట్టి, ఇప్పుడు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయిందని.. తాను ఎవరినీ విడిచిపెట్టబోనని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు.
 
బాధిత మహిళ తొలిసారిగా హోలీ ఆడేందుకు జపాన్ నుంచి భారత్‌కు వచ్చినట్లు సమాచారం. సెంట్రల్ ఢిల్లీలోని పహర్‌గండ్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు హోలీ ఆడుతున్నట్లు వైరల్ వీడియోలో కనిపించింది. ఇంతలో ఆ యువతి అటుగా వెళుతుంది. జపనీస్ అమ్మాయిని చూసి, కొంతమంది యువకులు ఆమెకు బలవంతంగా రంగు పూస్తారు. ఆ మహిళ నిరాకరించింది. కానీ ముగ్గురూ యువకులు ఆమెపై రంగులు చల్లారు. ఆమె ఇబ్బందిపడుతున్న ఓ అబ్బాయి ఆ అమ్మాయి తలపై బలంగా కోడిగుడ్డును పగలగొట్టాడు. దీని తర్వాత ఆ యువతి అక్కడి నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా.. ఓ యువకుడు .. ఆ యువతిని అసభ్యకరంగా తాకడం, పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆ యువతి ఆగ్రహానికి గురై.. ఆ యువకుడిని చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బాధిత బాలిక స్వయంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


నా రక్తం ఉడికిపోతోంది : స్వాతి మలివాల్ 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారిన వెంటనే ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో చూసిన ప్రతిసారీ నా రక్తం మరుగుతోంది అంటూ ట్వీట్ చేశాడు. ఏమి జరిగినా నేను వారిలో ఎవరినీ విడిచిపెట్టను, ఒకరిని కటకటాల వెనక్కి వచ్చేలా చూస్తాము. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్నవారు అమ్మాయికి ఎందుకు సాయం చేయలేదని కూడా విమర్శిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు మైనర్. నిందితులు కూడా తమ నేరాన్ని అంగీకరించారు.

ఢిల్లీ పోలీసుల లేఖ 

బాధిత మహిళ బంగ్లాదేశ్ వెళ్లిపోయింది. అదే సమయంలో ఢిల్లీ పోలీసులు జపాన్ ఎంబసీకి లేఖ రాశారు. నిందితులైన బాలురపై చర్యలు తీసుకున్నట్లు లేఖలో పోలీసులు తెలియజేశారు. అయితే ఢిల్లీ పోలీసులకు ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios