మన దేశం వాళ్లు... ఈ ఆస్కార్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేయడం వరకు ఒకే కానీ... విదేశీయులు సైతం దీనిని పండగలా చేసుకుంటున్నారు.

తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. ఇండియన్‌ సినిమా హిస్టరీగా నిలిచింది. ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డుల్లో ఇండియాకి రెండు ఆస్కార్లు రావడం ఓ విశేషమైతే, తెలుగు సినిమా `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్ రావడం మరో విశేషం. దాదాపు 95ఏళ్ల కల నేటితో నిజమైంది. `నాటు నాటు` పాటకిగానూ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ దక్కింది. ఈ పురస్కారాన్ని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌ అందుకున్నారు. 

ఈ ఆనందాన్ని తెలుగువారంతా ఆస్వాదిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే... మన దేశం వాళ్లు... ఈ ఆస్కార్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేయడం వరకు ఒకే కానీ... విదేశీయులు సైతం దీనిని పండగలా చేసుకుంటున్నారు. ముఖ్యంగా... జపాన్ లో ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు... మరింత ఎక్కువ ఆనందం చేస్తున్నారు.

View post on Instagram

ఈ క్రమంలోనే... ఓ జపాన్ జంట... నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కి కంగ్రాట్స్ చెబుతూ, వారికి డెడికేట్ చేస్తూడ్యాన్స్ చేశారు. ఇప్పుడు వీరి వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. వారి డ్యాన్స్ ని కూడా నెటిజన్లు అభినందిస్తున్నారు. కామెంట్ల రూపంలో వారి అభిమానాన్ని నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు.