సారాంశం

వారిద్దరూ కలిసి పానీపూరీ తిన్నప్పటి నుంచి తనకు కూడా పానీపూరీ రుచి చూడాలి అనిపించిందని హిరషి సుజుకీ చెప్పడం విశేషం.

మన దేశంలో పానీపూరీ బండ్లకు కొదవేలేదు. ఎక్కడ చూసినా కనపడుతూనే ఉంటాయి. ఈ పానీపూరీ తినడానికి జనాలు కూడా  విపరీతమైన ఇష్టం చూపిస్తూ ఉంటారు. నూనెలో వేయించిన చిన్న చిన్న పూరీల్లో శెనగల కూర, ఒకరకమైన వాటర్ కలిపి ఇస్తుంటే ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పానీపూరికి జపాన్ రాయబారి ఒకరు కూడా ఫిదా అయిపోవడం విశేషం.

ఈ పాపులర్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ని జపాన్ రాయబారి హిరషి సుజుకీ వారణాసిలో రుచి చూశారట. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. ఇటీవల జపాన్ ప్రధాని పునియోకిషోడా భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు భారత ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా పానీపూరీ, పచ్చిమామిడి రుచి చూపించారు. వారిద్దరూ కలిసి పానీపూరీ తిన్నప్పటి నుంచి తనకు కూడా పానీపూరీ రుచి చూడాలి అనిపించిందని హిరషి సుజుకీ చెప్పడం విశేషం.

ఇటీవల ఆయన కూడా పానీపూరీ రుచి చూశాడట. రుచి అద్భుతంగా ఉందని చెప్పడం విశేషం. తమ దేశ ప్రధాని కిషిదా, భారత ప్రధానితో కలిసి ఈ పానీ పూరీ తినప్పటి నుంచి తనకు కూడా రుచి చూడాలని అనిపించందని, ఫైనల్ గా రుచి చూశానంటూ ఆయన క్యాప్షన్ పెట్టి మరీ వీడియో షేర్ చేయడం విశేషం. తనకు బాగా నచ్చిందని ఆయన పేర్కొన్నారు.


పానీపూరీ మాత్రమే కాకుండా.. బనారసీ తాలీని కూడా ఆస్వాదించాడు. "ఆధ్యాత్మిక రాత్రి ఆర్తి చూసిన తర్వాత నేను స్వచ్ఛమైన బనారసీ తాలీని కూడా ఆస్వాదించాను. ఇంత ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు" అని రాశారు. ఆయన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఆయన పోస్టుకి నెటిజన్లు కూడా సరదాగా రిప్లై ఇస్తుండటం విశేషం.
ఆయన పోస్ట్‌కి 654k పైగా వ్యూస్, వేలల్లో కామెంట్స్ రావడం విశేషం.