Today Top Stories:  కొలువుదీరిన బాలరాముడు..  గుడిలోకి రాహుల్ కు నో ఎంట్రీ..మందుబాబులకు గుడ్ న్యూస్..

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  కొలువుదీరిన బాలరాముడు.. నేటీ నుంచి సామాన్య భక్తులకూ చాన్స్, మెట్రో ఫేజ్ 2 రూట్స్ ఖరారు.. ప్రతిపాదించిన మెట్రో మార్గాలివే..  దేవాలయంలోకి రాహుల్ గాంధీ ప్రవేశానికి నిరాకరణ.. రామ రాజ్యం: హిమంత శర్మ కౌంటర్, మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్,జగన్ కు ఆహ్వానం అందలేదా? అందినా వెళ్ళలేదా? ,రవిశాస్త్రికి బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు - శుభ్‌మన్ గిల్‌ కూడా వంటి వార్తల సమాహారం. 

January 23 th 2024 Today Top Stories, Top 10 Telugu News, Andhra pradesh, Telangana, Headlines KRJ

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  కొలువుదీరిన బాలరాముడు.. నేటీ నుంచి సామాన్య భక్తులకూ చాన్స్, మెట్రో ఫేజ్ 2 రూట్స్ ఖరారు.. ప్రతిపాదించిన మెట్రో మార్గాలివే..  దేవాలయంలోకి రాహుల్ గాంధీ ప్రవేశానికి నిరాకరణ.. రామ రాజ్యం: హిమంత శర్మ కౌంటర్, మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్,జగన్ కు ఆహ్వానం అందలేదా? అందినా వెళ్ళలేదా? ,రవిశాస్త్రికి బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు - శుభ్‌మన్ గిల్‌ కూడా వంటి వార్తల సమాహారం. 

కొలువుదీరిన బాలరాముడు.. నేటీ నుంచి సామాన్య భక్తులకూ చాన్స్ 

అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కలను సాకారమైంది. అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మించిన నూతనంగా మందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామలాలా (బాలరాముడు)ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అభిజిత్ లగ్న మూహూర్తాన మధ్యాహ్నం 12:29 నిమిషాల 8 సెకన్లకు వేదమంత్రాలు, మంగళవా యిద్యాల మధ్య శ్రీరాముడి విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనంగా ఉన్న వస్త్రాన్ని తొలగించారు. తొలి దర్శనం చేసుకున్న స్వామివారికి పట్టువస్త్రాలు, ఛత్రం, పాదుకలు సమర్పించారు. అనంతరం 108 దీపాలతో స్వామివారికి మొదటి మహా హారతి ఇచ్చారు. ఇదిలా ఉంటే. నేటీ నుంచి సామాన్య భక్తులకు స్వామి వారికి దర్శించుకునే అవకాశం కల్పించారు. 

మెట్రో ఫేజ్ 2 రూట్స్ ఖరారు.. ప్రతిపాదించిన మెట్రో మార్గాలివే..  
 
Hyderabad Metro Rail: హైదరాబాద్ వాసులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 మార్గాన్ని ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్ సిద్దం చేశారు. మొత్తం 70 కిలో మీటర్ల మేర రెండో దశ మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు చేయగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2 వ ఫేజ్ ను 4 కారిడార్లుగా నిర్మించనున్నారు. అలాగే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు మార్గాన్ని పొడిగించనున్నారు.

Ayodhya Ram Mandir: జగన్ కు ఆహ్వానం అందలేదా? అందినా వెళ్ళలేదా? 


Ayodhya Ram Mandir: అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కలను సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం నాడు రామ్ లలా ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రామమందిర ప్రతిష్ఠ మహోత్సవానికి దాదాపు 8 వేల మంది అతిథులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీరిలో సినీ తారలు, రాజకీయ నాయకులు, పీఠాధిపతులు, సాధువులు ఉన్నారు. అయితే, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంతకీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కేంద్రం నుంచి కానీ, నిర్వాహకుల నుంచి కానీ ఆహ్వానం అందిందా?  లేదా ? అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. 

దేవాలయంలోకి రాహుల్ గాంధీ ప్రవేశానికి నిరాకరణ.. రామ రాజ్యం: హిమంత శర్మ కౌంటర్

Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్న రాహుల్ గాంధీ అసోంలో ఓ దేవాలయానికి వెళ్లాలని అనుకున్నారు. అనుమతులు తీసుకున్నారు. తీరా మందిరం ముందుకు వెళ్లాక భద్రతా సిబ్బంది ఆయనను లోపలికి అనుమతించలేదు. ఎందుకు అనుమతించరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తాను ఏం తప్పు చేశానని నిలదీశారు. కానీ, అధికారులు మాత్రం ఆయనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ వర్కర్లతో ఆలయం ముందే ఆయన ధర్నాకు దిగారు. ఈ ఘటనపై అసోం సీఎం హిమంత శర్మ కౌంటర్ ఇచ్చారు. రామ రాజ్య అంటూ ట్వీట్ చేశారు.

ఢిల్లీలో మరోసారి భూప్రకంపనాలు.. వణికిపోతున్న జనం..  

Delhi Earthquake:  ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూప్రకంపనాలు సంభవించాయి. సోమవారం రాత్రి 11.40 గంటల ప్రాంతంలో చైనాలోని దక్షిణ జిన్‌జియాంగ్ ప్రాంతంలో  7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తర్వాత ఢిల్లీ సోమవారం అర్థరాత్రి ప్రకంపనలు వచ్చాయి. నివేదికల ప్రకారం..  చైనాలోని దక్షిణ జిన్‌జియాంగ్‌లో భూకంప కేంద్రం ఉందని, రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదైందని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.

రవిశాస్త్రికి బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు - శుభ్‌మన్ గిల్‌ కూడా


BCCI Awards: భారత మాజీ ఆల్‌రౌండర్, మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి బీసీసీఐ  లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనుండగా, టీమిండియా ఓపెనర్ శుభమాన్ గిల్ ‌ను క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించనున్నారు. మంగళవారం బీసీసీఐ అవార్డులను ప్రదానం చేయనుంది. ఇది 2019 తర్వాత మొదటిసారి నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి భారత్, ఇంగ్లండ్ జట్లు హాజరు కానున్నాయి.

మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..  

తెలంగాణ రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే విభాగాల్లో ఒకటైన ఎక్సయిజ్ డిపార్టుమెంటుపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సోమవారం సమీక్ష చేస్తూ ఈసారి మద్యం ధరలను పెంచకుండా ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రివ్యూ చేశారు. ఎలైట్ బార్, షాపులను ఏర్పాటు చేయడానికి ఏకీకృత విధానం ఉండేలా పకడ్బందీ మెకానిజాన్ని రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని , విస్త్రుతంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులను 
ముమ్మరంగా ఉండాలని స్పష్టం చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios