జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్... తమిళంలో తన తొలి స్పీచ్ ని అదరగొట్టారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఏపీ విభజన సమస్యలపై అక్కడి మీడియాతో ఆయన మాట్లాడారు.

తొలిసారి అయినప్పటికీ.. ఆయన తమిళంలో అద్భుతంగా ప్రసంగించారు. తనను పరిచయం చేసుకుంటూ తన పేరు పవన్ కల్యాణ్ అని.. 2014లో జనసేన పార్టీ ప్రారంభించిన విషయాన్ని తెలిపారు. 20 ఏళ్లు చెన్నైలో ఉన్నానన్న పవన్.. తన తమిళంలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరని విన్నవించుకున్నారు. 

ఐరోపా, అమెరికాలో పర్యటించిన తాను.. పొరుగు రాష్ట్రాల్లో కూడా జనసేన వాణి వినిపించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని తెలిపారు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అవలంభిస్తున్న విధానాలను విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో చోటుచేసుకున్న సంఘటనలను గుర్తు చేశారు.