న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో  విధ్వంసానికి కారణమైన నటుడు, సింగర్ దీప్ సిద్దుపై లక్ష రూపాయాల రివార్డును ఢిల్లీ పోలీసులు బుధవారం నాడు ప్రకటించారు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో విధ్వంసం చోటు చేసుకొంది. ఎర్రకోట నుండి దీప్ సిద్దు ఫేస్ బుక్ లైవ్ కూడ ఇచ్చారు.ఈ ఘటన జరిగిన నుండి ఆయన కన్పించకుండా పోయాడు అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఢిల్లీ పోలీసులు దీప్ సిద్దు ఆచూకీ తెలిపితే లక్ష రూపాయాల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. దీప్ సిద్దూతో పాటు మరో ముగ్గురిపై కూడ పోలీసులు ప్రకటించారు. దీప్ సిద్దు కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకొన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. దీప్ సిద్దు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. దీప్‌సిద్దు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.