ఇల్లు దాటితే ముఖంపై స్టాంప్ పడుద్ది: లాక్‌డౌన్ అమలుకు కశ్మీర్ పోలీసుల ప్రయోగం
కరోనా కట్టడికి దేశం మొత్తం 21 రోజులు లౌక్‌డౌన్ ప్రకటించిన ప్రభుత్వం వ్యాధి మరింత ప్రబలకుండా నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు గడపదాటి రోడ్ల మీదకు రావొద్దని పోలీసులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు.
కరోనా కట్టడికి దేశం మొత్తం 21 రోజులు లౌక్‌డౌన్ ప్రకటించిన ప్రభుత్వం వ్యాధి మరింత ప్రబలకుండా నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు గడపదాటి రోడ్ల మీదకు రావొద్దని పోలీసులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు.
ప్రధాని నరేంద్రమోడీతో పాటు ముఖ్యమంత్రులు చేతులు జోడించి దండాలు పెడుతున్నా జనం వినిపించుకోవడం లేదు. ఏ మాత్రం బాధ్యత లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు.
Also Read:మద్యం అనుకొని శానిటైజర్ తాగి రిమాండ్ ఖైదీ మృతి
ఎన్నిసార్లు హెచ్చరించినా, చివరికి లాఠీలతో కొడుతున్నా పట్టించుకోకపోవడంతో నిబంధనలను ఉల్లంఘించి ఏ కారణం లేకుండా రహదారులపైకి వచ్చిన కొందరు వ్యక్తులపై జమ్మూకాశ్మీర్ ప్రజలు వినూత్న చర్యలు చేపట్టారు.
లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారి చేతులు, నుదురుపై తుడుచుకోవడానికి సాధ్యం కానీ ఇంకుతో స్టాంపు వేశారు. దీనిపై లాక్‌డౌన్ అతిక్రమణదారు అనే మాటలతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్ పేరు కూడా ఉంటుంది. కాగా ఈ స్టాంపు కనీసం 15 రోజుల పాటు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Also Read:కరోనా అనుమానం: భయంతో సొంత తమ్ముడిని చంపిన అన్న
దీని వల్ల వాళ్లు మరోసారి నిబంధనలను అతిక్రమించకుండా ఉంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఒకవేళ మళ్లీ తప్పు చేస్తే వారిని గుర్తించడానికి వీలు కలుగుతుందని వివరించారు. కాగా జమ్మూకాశ్మీర్‌లో గురువారం నాటికి 13 మందికి కరోనా సోకగా, ఒకరు మరణించారు.