మద్యం అనుకొని శానిటైజర్ తాగి రిమాండ్ ఖైదీ మృతి
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలో రిమాండ్ ఖైదీ ఆల్మహల్ గా భావించి శానిటైజర్ ను తాగి మృతి చెందాడు.
కేరళ:కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలో రిమాండ్ ఖైదీ ఆల్మహల్ గా భావించి శానిటైజర్ ను తాగి మృతి చెందాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ నుండి రామన్ కుట్టి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు. ఆల్కహాల్ గా భావించిన రామన్ కుట్టి తాగాడు. అస్వస్థతకు గురైన ఆయనను మంగళవారం నాడు ఆసుపత్రిలో చేర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జైలు ఆవరణలోనే తయారు చేసిన శానిటైజర్ ను రిమాండ్ ఖైదీ తాగినట్టుగా అనుమానిస్తున్నామని సీనియర్ జైలు అధికారి ఒకరు తెలిపారు.
మంగళవారం నాడు రాత్రి కూడ రామన్ కుట్టి ఆరోగ్యంగానే ఉన్నాడని అధికారులు గుర్తు చేశారు. బుధవారం నాడు ఉదయం రోల్ కాల్ కూడ ఆయన హాజరయ్యారని కూడ వాళ్లు చెప్పారు. అయితే బుధవారం నాడు ఉదయం పదిన్నర గంటలకు ఉన్నట్టుండి ఆయన కుప్పకూలిపోయినట్టుగా అధికారులు తేల్చి చెప్పారు.
also read:కరోనా ఎఫెక్ట్: రెపో రేటు 4.40%తగ్గింపు, 3 నెలలు ఈఎంఐలపై మారటోరియం...
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేన్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం తర్వాతే రిమాండ్ ఖైదీ ఏ కారణం చేత మరణించాడనే విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో శానిటైజర్లను తయారు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఖైదీలను కోరాయి.ఈ క్రమంలోనే పాలక్కాడ్ జైలులో కూడ ఖైదీలతో శానిటైజర్ తయారు చేయిస్తున్నారు.