Asianet News TeluguAsianet News Telugu

జమ్మూకాశ్మీర్‌ కాంగ్రెస్‌కు షాక్.. మరో సీనియర్‌ నేత రాజీనామా

గులాంన‌బీ ఆజాద్ రాజీనామాతో జ‌మ్మూకాశ్మీర్ కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎనిమిది మంది మాజీ మంత్రులు, ఒక మాజీ ఎంపీ, తొమ్మిది మంది శాసనసభ్యులు, పెద్ద సంఖ్యలో పంచాయతీరాజ్ సంస్థ సభ్యులు, ఇతరుల రాజీనామాకు సిద్ధ‌మ‌య్యారు.
 

Jammu Kashmir Congress; Another senior leader Ashok Sharma resigned
Author
First Published Sep 4, 2022, 5:55 AM IST

జ‌మ్మూకాశ్మీర్: జ‌మ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్ కు వ‌రుస షాక్ లు త‌గులుతూనే ఉన్నాయి. ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. దీంతో అక్క‌డ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. సీనియ‌ర్ పొలిటిక‌ల్ లీడ‌ర్, జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి గులాం న‌బీ ఆజాద్ రాజీనామా త‌ర్వాత అక్క‌డ ఈ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. తాజాగా మ‌రో నాయ‌కుడు సైతం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ శాసనసభ్యుడు అశోక్ శర్మ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇదే విష‌యం గురించి పేర్కొంటూ శ‌నివారం నాడు లేఖ రాశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 'విచార్ విభాగం' జాతీయ సమన్వయకర్త,  ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ స‌భ్యుడైన ఆయ‌న "ప్రస్తుత పరిస్థితి-అనివార్య పరిస్థితుల కారణంగా ఇలాంటి బాధాకరమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి గులాం న‌బీ ఆజాద్ రాజీనామా త‌ర్వాత కాంగ్రెస్ ను వీడుతూ ఆయ‌న శిబిరంలో చేరుతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. గులాంన‌బీ ఆజాద్ రాజీనామాతో జ‌మ్మూకాశ్మీర్ కాంగ్రెస్ నేత‌, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎనిమిది మంది మాజీ మంత్రులు, ఒక మాజీ ఎంపీ, తొమ్మిది మంది శాసనసభ్యులు, పెద్ద సంఖ్యలో పంచాయతీరాజ్ సంస్థ సభ్యులు, ఇతరుల రాజీనామాకు సిద్ధ‌మ‌య్యారు. కాగా, సీనియ‌ర్ పొలిటిక‌ల్ లీడ‌ర్ ఆయిన ఆజాద్.. ఆగ‌స్టు 26న కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌తో తన ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. పార్టీని సమగ్రంగా నాశనం చేశార‌నీ, పార్టీ సంప్రదింపుల యంత్రాంగాన్ని మొత్తం కూల్చివేశార‌ని రాహుల్ గాంధీపై ఆయన మండిపడ్డారు.

కాగా, జ‌మ్మూకాశ్మీర్ లో తాజాగా కాంగ్రెస్ ను వీడిన అశోక్ వ‌ర్మ‌..1996లో రాజౌరీ జిల్లాలోని కలకోట్ నియోజకవర్గం నుంచి మొద‌టి సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. శర్మ తన రాజీనామా లేఖ‌లో “నేను నా పార్టీని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. చిన్న స్థాయి నుండి దశాబ్దాలుగా అట్టడుగు స్థాయిలో దానిని నిర్మించడానికి పోరాడాను. దేశంలోని అనేక రాష్ట్రాలకు ప్రాదేశిక యూనిట్లు ఉన్నాయి. త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ఎంతో బాధ‌తో ఈ నిర్ణ‌యం తీసుకుంటున్నాను" అని పేర్కొన్నారు.

ఇదిలావుండ‌గా, కాంగ్రెస్‌ను వీడిన తర్వాత గులాం నబీ ఆజాద్ సెప్టెంబర్ 4న జమ్మూలో తన తొలి ర్యాలీని నిర్వహించనున్నట్టు తెలిపారు. అదే రోజు రాహుల్ గాంధీ దేశ రాజధానిలో 'మెహంగాయ్ పర్ హల్లా బోల్' కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆజాద్ ప్రారంభోత్సవ కార్యక్రమం రాహుల్ గాంధీ చేప‌ట్ట‌బోయే ర్యాలీతో సమానంగా ఉండటంతో, ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరగబోయే మెగా ఈవెంట్‌లో మాజీ కాంగ్రెస్ చీఫ్ ప్రసంగించే  రోజు పొలిటిక‌ల్ హీట్ మరింత‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. తన రాజీనామా లేఖ కేవలం "మంచు పర్వత కొన" అని గులాం న‌బీ ఆజాద్ పేర్కొన‌డం.. రాబోయే రోజుల్లో గాంధీలపై తన దాడిని మరింత ఉధృతంగా ఉంటుంద‌నే సంకేతాలు పంపారు.

Follow Us:
Download App:
  • android
  • ios