జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో శుక్రవారం నాడు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఇంకా ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్యకాల్పులు కొనసాగుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో శుక్రవారం నాడు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఇంకా ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్యకాల్పులు కొనసాగుతున్నాయి.
అనంతనాగ్‌లోని ఓ ఇంట్లో టెర్రరిసట్టులు ఉన్నారనే సామాచారం మేరకు ఆర్మీ సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ మేరకు ఉగ్రవాదులకు, ఆర్మీ జవాన్లకు మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
అయితే మరో ఉగ్రవాది ఇంట్లోనే నక్కి ఉన్నాడని ఆర్మీ భావిస్తోంది. ఈ ప్రాంతంలో ఆర్మీ సోదాలు నిర్వహిస్తోంది. అనంతనాగ్ ప్రాంతంలో ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య కాల్పుల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా శుక్రవారం ఉదయం నుండి ఇంటర్నెట్ ను నిలిపివేశారు.
మరో ముగ్గురు ఉగ్రవాదులను ఆర్మీ చుట్టుముట్టింది. దీంతో ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్టు ఆర్మీ అధికారులు ప్రకటించారు.
Last Updated 9, Sep 2018, 11:09 AM IST