Terror Attack: శ్రీన‌గ‌ర్ లో శ‌నివారం ఉద‌యం ఉగ్ర‌దాడి జ‌రిగింది. ఐవా బ్రిడ్జిపై చోటుచేసుకున్న తీవ్ర‌వాద దాడిలో జ‌మ్మూకాశ్మీర్ పోలీసులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  

JammuKashmir terror attack: జ‌మ్మూకాశ్మీర్ లో మ‌ళ్లీ ఉగ్ర‌కార్య‌క‌లాపాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. స‌రిహ‌ద్దు వెంబ‌డి పెద్ద సంఖ్య‌లో ఉగ్ర‌మూక‌లు ఉన్నార‌నే నిఘా రిపోర్టులు ఆందోళ‌న‌ను పెంచుతున్నాయి. ఈ క్ర‌మంలోనే భ‌ద్ర‌తా బ‌ల‌గాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. నేప‌థ్యంలో జ‌మ్మూకాశ్మీర్ లో మ‌రోసారి ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. శనివారం ఉదయం శ్రీనగర్‌లోని ఐవా బ్రిడ్జి వద్ద ఉగ్రవాదులు కాల్పులు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక ప‌లువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఒక‌రి ప‌రిస్థితి ఆందోళ‌క‌రంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. "శ‌నివారం ఉదయం 8:40 గంటలకు, శ్రీన‌గ‌ర్ లోని సఫకదల్ ప్రాంతంలోని ఐవా బ్రిడ్జి సమీపంలో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పోలీసుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో కానిస్టేబుల్ గులాం హసన్‌పై కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు" అని ఓ పోలీసు ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు. 

ఈ విష‌యం తెలుసుకున్న భ‌ద్ర‌తా బ‌ల‌గాలు వెంట‌నే ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి.. దాడుల‌కు పాల్ప‌డిన ఉగ్ర‌వాదుల కోసం వెతుకులాట ప్రారంభించామని అధికారులు తెలిపారు. కాగా, అంత‌కు ముందురోజు.. జమ్మూ & కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో వార్షిక అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే మార్గంలో హిజ్బుల్ ముజాహిదీన్ అగ్ర కమాండర్ అష్రఫ్ మోల్వి మరియు అతని ఇద్దరు సహచరులు కాల్చి చంపబడిన ఒక రోజు తర్వాత భద్రతా సిబ్బందిపై దాడి జరగ‌డం గ‌మ‌నార్హం. ఈ దాడికి ప్రతీకారంగానే శ‌నివారం కాల్పుల‌కు తెగ‌బ‌డి ఉంటార‌ని అధికారులు అనుమానిస్తున్నారు. “అష్రఫ్ మోల్వీ (హెచ్‌ఎం ఉగ్రవాద సంస్థకు చెందిన చాలా సీనియ‌ర్ ఉగ్రవాదులలో ఒకరు)తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అమ‌ర్‌నాథ్‌ యాత్ర మార్గంలో విజయవంతమైన ఈ ఆపరేషన్ మాకు పెద్ద విజయం” అని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కశ్మీర్) విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. అతను కూడా టాప్ 10 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నాడ‌ని తెలిపారు. పహల్గామ్‌ను బేస్ క్యాంప్‌గా చేసుకుని అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభం కానుంది. 

కాగా, ఈ వారం ప్రారంభంలో, పుల్వామా జిల్లా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు లష్కర్ ఉగ్ర‌గ్రూపున‌కు చెందిన ఓ సహాయకుడు పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. “ఆర్మీకి చెందిన 24 రాష్ట్రీయ రైఫిల్స్ మరియు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌తో పాటు గాండెర్‌బల్ పోలీసులచే జాయింట్ నాకా రాబితార్ గ్రామంలో వేయబడింది. చెకింగ్ సమయంలో, డబ్ వకూరా నుండి వస్తున్న తెల్లటి స్కార్పియో యు-టర్న్ తీసుకొని పారిపోవడానికి ప్రయత్నించింది”అని పోలీసులు తెలిపారు. “సెక్యూరిటీ బలగాలు స్కార్పియోను ఆపగలిగారు. డ్రైవర్‌ను కింద‌కు దించి.. కారుతో పాటు అత‌నిని సెర్చ్ చేయ‌గా.. అతని వద్ద నుండి 10 AK లైవ్ ఆర్డీఎస్ (10 AK live rds) లను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈలోగా డ్రైవర్ పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ.. సెర్చ్ అధికారుల‌పై దాడికి పాల్ప‌డ్డాడు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆ దుండ‌గుడిని ఆదుపులోకి తీసుకున్నారు. స్కార్పియో డ్యాష్‌బోర్డ్ నుండి మరో 15 AK లైవ్ ఆర్‌డిఎస్ (10 AK live rds) లను మరియు ఒక AK మ్యాగ్‌ని (AK Mag) స్వాధీనం చేసుకున్నారు” అని అధికారులు తెలిపారు.