Asianet News TeluguAsianet News Telugu

హనీ ట్రాప్.. ఆపదలో ఉన్నానంటూ పిలిపించి, గదిలోకి తీసుకెళ్లి.. వీడియో తీసి.. బ్లాక్ మెయిల్..

ఆపదలో ఉన్నాను ఆదుకోమంటూ ఓ యువతి ఫోన్ చేసింది. కాపాడడానికి వెళ్లిన అధికారిని గదిలోకి తీసుకువెళ్లి.. బలవంతంగా వీడియో తీసి.. బెదిరించడం మొదలుపెట్టింది.

Jammu and Kashmir Police arrested Honey trap gang
Author
First Published Sep 30, 2022, 10:18 AM IST

శ్రీనగర్ : సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకుని ‘వలపు’ ఉచ్చులో వారిని బంధించాక రూ. లక్షల వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. గత ఆరునెలల్లో ఈ ముఠా రూ. 40 లక్షలకు దాకా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు అధికారులు గురువారం వెల్లడించారు. రూ.8 లక్షలు ఇవ్వకపోతే ‘రహస్య వీడియో’ బయటపెడతామని ఓ ముఠా బెదిరిస్తోందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కూపీ లాగారు.

భార్యాభర్తలయినా శాయిస్తా బహీర్, ఐజాజ్ అహ్మద్  గనీలతోపాటు జహంగీర్ అహ్మద్ దార్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఆపదలో ఉన్నట్లు శాయిస్తా చేసిన ఫోన్ తో వారి ఇంటికి వెళ్లిన అధికారిని..  మాట్లాడే నెపంతో ఆమె పడక గదిలోకి తీసుకెళ్ళింది. అదే సమయంలో లోనికి చొరబడిన ఐజాజ్, జహంగీర్.. ఆ ఇద్దరినీ కలిసి వీడియో తీశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియో వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు.

హాస్పిటల్ వార్డులో కాల్ గర్ల్ తో క్రిమినల్ సరసాలు....!

ఇదిలా ఉండగా, ఇలాంటి మోసమే ఈ ఫిబ్రవరిలో హైదరాబాద్ లో వెలుగుచూసింది. అభిరుచులు కలిసాయి..  భావాలు ఒకేలా ఉన్నాయి..  ఇంకెందుకు ఆలస్యం.. అవధులు లేని ఆనందం ఆస్వాదిద్దాం.. అంటూ వాట్సాప్ కాల్ ద్వారా నగ్నంగా మాట్లాడతారు. స్పందిస్తే యాప్ సహాయంతో వీడియో తీసి బెదిరిస్తారు. ఈ వ్యవహారాలు నడిపే ఘరానా నేరస్తుల గుట్టురట్టయింది. వాట్స్అప్ కాల్ మాట్లాడుతున్నది అసలు అమ్మాయిలే కాదని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు అధికారులు తేల్చారు. నగ్న వీడియోలతో తనను చేస్తున్నారంటూ వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాకు వెళ్లారు.

అక్కడ బాధితుల నుంచి లక్షల్లో నగదు బదిలీ చేసుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. పలు రాష్ట్రాలకు చెందిన వారి నుంచి ఆరేడు నెలల్లోనే వీరు రూ. 25 కోట్లు కొల్లగొట్టారని గుర్తించారు. భరత్పూర్ సైబర్ నేరస్తులు ఫేస్బుక్ ద్వారా  ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో యువకులు, వృత్తి నిపుణులను పరిచయం చేసుకుంటారు. ఒకటి రెండు రోజులు ఫేస్బుక్ ద్వారా మాట్లాడిన తర్వాత వారి వాట్సాప్ నెంబర్లను తీసుకుంటారు. ఆ వాట్స్అప్ కాల్ మొదలైన వెంటనే పరిచయం చేసుకున్న యువతి బట్టలన్నీ విప్పేసి నగ్నంగా మారుతుంది.

అయితే ఆమె అసలు యువతే కాదు.. అదంతా సాంకేతిక మాయాజాలం. ఫోన్ లో అప్పటికే డౌన్లోడ్ చేసుకున్న అశ్లీల వీడియోల్లో ఒకదాన్ని సైబర్ నేరస్తులు బాధితుడికి పంపుతున్నారు. ఆ వీడియోలోని యువతి పెదాల కదలికల అనుగుణంగా వాయిస్ చేంజ్ యాప్ ద్వారా అమ్మాయిలు మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ఒకటి రెండు రోజులు నగ్న వీడియోల ద్వారా మాట్లాడాక.. మీరు కూడా నగ్నంగా మాట్లాడండి అంటూ కోరతారు. బాధితులు వీడియో కాల్ చేయడం మొదలు పెట్టగానే మీ ముఖం కనిపించేలా మాట్లాడండి అంటారు. అలా మాట్లాడడం మొదలు పెట్టగానే.. అవతలి వైపు మాట్లాడుతున్న నిందితుడు మరో కెమెరాతో బాధితుడి మాటలు, వీడియోలను రికార్డు చేస్తారు.  ఆ తర్వాత వీడియోను  బాధితుడికి పంపి  బెదిరించి డబ్బులు గుంజుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios