జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లోని హసన్‌పోరా ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ మేరకు పోలీసులు సోమవారం వివరాలు వెల్లడించారు. 

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లోని హసన్‌పోరా ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు సోమ‌వారం తెలిపారు. ‘‘కుల్గామ్ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. వారెవ‌రో గుర్తించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఉగ్ర‌వాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాం. మరిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.

ఆదివారం తెల్లవారుజామున కుల్గామ్‌లోని హసన్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్ర‌వాదుల నుంచి కాల్పులు జ‌ర‌ప‌డంతో సెర్చ్ ఆప‌రేష‌న్ ఎన్ కౌంట‌ర్ గా మారింద‌ని పోలీసు అధికార ప్ర‌తినిధి తెలిపారు. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.