శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అదే రోజు జమ్మూకాశ్మీర్ బీజేపీ యూనిట్ కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ కావడంపై అక్కడి రాజకీయాల్లో బీజేపీ పాత్ర మరోసారి చర్చనీయాంశంగా మారింది.
జమ్మూకాశ్మీర్: రాజకీయాలు ఎప్పుడు ఏ విధమైన మలుపును తీసుకుంటాయో ఒక్కోసారి ఊహించని విధంగా ఉంటాయి. ఇప్పుడు జమ్మూకాశ్మీర్ రాజకీయాలు సైతం ఇదే విధంగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకుల వరుస రాజీనామాలు.. బీజేపీ నేతల మీటింగులు, స్థానిక పార్టీలు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై చేస్తున్న విమర్శలు.. ఇలా అక్కడ జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా కాకపుట్టిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగారు. పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పై విమర్శలు గుప్పించారు. అయితే, అదే రోజున జమ్మూకాశ్మీర్ బీజేపీ నేతలు ప్రత్యేక సమావేశం, కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. దీంతో మరోసారి అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలలో బీజేపీ పాత్ర అంశం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన రోజున జమ్మూకాశ్మీర్ బీజేపీ యూనిట్ సంస్థాగత సమస్యలను, కేంద్ర పాలిత ప్రాంతంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించడానికి హోం మంత్రి అమిత్ షాను కలిసింది. ఓటర్ల జాబితా ఖరారు ప్రక్రియ, దాని టైమ్‌టేబుల్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఏడాది ఎన్నికలను బీజేపీ ఊహించలేదని పార్టీలోని సీనియర్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ స్థానాల విభజన సంస్థాగతంగా ర్యాంప్-అప్ కోసం కొన్ని కార్యాచరణ ప్రణాళికను చర్చించాల్సిన అవసరాన్ని ప్రేరేపించింది. "ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. అయితే పార్టీ (బీజేపీ) సన్నాహాలు ప్రారంభించాలి. ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి" అని ఒక మూలం పేర్కొంది. జమ్మూకాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, దేవేంద్ర సింగ్ రాణా, ఎంపీ జుగల్ కిషోర్,కో-ఇంఛార్జి ఆశిష్ సూద్, శక్తి రాజ్ పరిహార్‌లతో సహా ఇతర సీనియర్ పార్టీ నాయకులు, జమ్మూకాశ్మీర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, అమిత్ షాతో సమావేశానికి హాజరయ్యారు.
దీనిపై రాజకీయాలో భిన్నమైన చర్చ నడుస్తోంది. బీజేపీ పై అక్కడి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గులాం నబీ వెనుక బీజేపీ ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో అక్కడి బీజేపీ ఈ అంశంపై స్పందించింది. అమిత్ షా తో నేతల సమావేశం ముందే షెడ్యూల్ చేయబడిందని, గులాం నబీ ఆజాద్ రాజీనామా విషయంలో ఎటువంటి ప్రభావం లేదని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఆజద్ కాంగ్రెస్ నుండి నిష్క్రమించిన తర్వాత జమ్మూకాశ్మీర్ లో ప్రాంతీయ పార్టీని స్థాపించి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తారనే ఊహాగానాలపై, BJP నాయకులు.. ఆజాద్ ప్రణాళికల విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నారు. డీలిమిటేషన్ కసరత్తు తర్వాత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు చర్చకు వచ్చినట్లు బీజేపీ నేతలు తెలిపారు. "అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ దేశంలోని మిగిలిన ప్రాంతాల తరహాలో ఉంది. షెడ్యూల్డ్ తెగలు, ఇతరులకు రిజర్వ్ చేయబడిన సీట్లు ఉన్నాయి. రాష్ట్ర యూనిట్ అన్ని స్థానాల్లో సంస్థాగత నెట్‌వర్క్‌ను రూపొందించాలి" అని ఒక మూలం తెలిపింది. అలాగే, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా శుక్రవారం అమిత్ షాతో సమావేశమయ్యారు.
