Asianet News TeluguAsianet News Telugu

భార‌త్ జోడో యాత్ర‌లో రాహుల్ తో క‌లిసి న‌డిచిన సినీ న‌టి ఊర్మిళ మటోండ్కర్

New Delhi: ప్ర‌స్తుతం కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్‌లో ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ యాత్ర‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. రాహుల్ గాంధీతో కలిసి భార‌త్ జోడో యాత్రంలో ప‌లువురు ప్ర‌ముఖులు పాలుపంచుకుంటూ మద్దతు పలుకుతున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ నటి, శివసేన నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్ కూడా మంగ‌ళ‌వారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
 

Jammu and Kashmir:Actress Urmila Matondkar who walked with Rahul in Bharat Jodo Yatra
Author
First Published Jan 24, 2023, 12:43 PM IST

Bharat Jodo Yatra: కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు, వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గ‌ పార్ల‌మెంట్ స‌భ్యులు రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో ముందుకు సాగుతున్న  భారత్ జోడో యాత్ర ప్ర‌స్తుతం జమ్మూ కాశ్మీర్‌లో ఉంది. రాహుల్ గాంధీతో కలిసి భార‌త్ జోడో యాత్రలో పాలుపంచుకుంటూ ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు మద్దతు పలుకుతున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ నటి, శివసేన నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్ కూడా మంగ‌ళ‌వారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. జ‌మ్మూకాశ్మీర్ లో ముందుకుసాగుతున్న కాంగ్రెస్ దేశ‌వ్యాప్త భారత్ జోడో యాత్రలో నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలో జరుగుతున్న పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. 'తారలు చేరితే ప్రయాణం ప్రకాశవంతంగా మారుతుంది' అని ఆ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ట్వీట్ చేసింది. సెప్టెంబర్ లో భార‌త్ జోడో యాత్ర‌ ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ కు వెలుపల పలువురు ప్రముఖులు పార్టీ పాద యాత్రలో పాల్గొంటున్నారు. పూజా భట్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, సీనియర్ ఆర్మీ అధికారులు రాహుల్ గాంధీ వెంట నడిచారు. గత నెలలో ఢిల్లీలో మ‌క్క‌ల్ నిదిమ‌య్యం నాయ‌కులు, సినీ న‌టుడు కమల్ హాసన్ పాదయాత్రలో పాల్గొన్నారు.

 

ఊర్మిళ మటోండ్కర్ గాంధీతో కలిసి నడుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'వాక్ ఫర్ యూనిటీ, ఎఫినిటీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ' అంటూ ట్వీట్ చేశారు. కవాతుకు ముందు ఆమె ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు, "ఈ శీతాకాల చలిలో, నేను జమ్మూ నుండి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మరికాసేపట్లో యాత్రలో పాల్గొంటాను. భారత ఐక్యతే ఈ యాత్రలో ముందుకు సాగిన స్ఫూర్తి. మనమందరం ఈ భారతదేశాన్ని సృష్టించాము.. ఇది ఎదగడానికి మనం సహాయపడాలి. నాకు ఈ యాత్ర రాజకీయాల కంటే సమాజం కోసమే. ద్వేషంతో కాకుండా ప్రేమతో ప్రపంచం పనిచేస్తుంది' అని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.

 

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉదయం 8 గంటలకు సైనిక స్థావరం సమీపంలో నుంచి ర్యాలీ ప్రారంభమైన కొద్దిసేపటికే మటోండ్కర్ రాహుల్ గాంధీతో చేరారు. వారికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు రోడ్డుపై క్యూ కట్టారు. 48 ఏళ్ల ఊర్మిళ మటోండ్కర్ 2019 సెప్టెంబర్లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి 2020లో శివసేనలో చేరారు. కాగా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వర‌కు కొన‌సాగుతున్న కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర లో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ),  రాష్ట్రీయ స్వ‌య్ సేవ‌క్ సంఘ్ (ఆరెస్సెస్) లపై విమ‌ర్శ‌లు గుప్పించిన కాంగ్రెస్ నాయ‌కులు.. అధికార పార్టీ వ్యాప్తి చేస్తున్న విద్వేషాన్ని ఎదుర్కోవడమే తమ పార్టీ లక్ష్యమని స్ప‌ష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios