Asianet News TeluguAsianet News Telugu

జ‌మ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్ కు త‌ప్ప‌నితిప్ప‌లు.. మ‌రో 20 మంది నేతల రాజీనామా..

జమ్మూ కాశ్మీర్: గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా మరో 20 మంది కాంగ్రెస్ నేతలు పార్టీని వీడారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్‌తో సహా మొత్తం 64 మంది నాయకులు తమ రాజీనామాను సమర్పించి గులాం నబీ ఆజాద్ శిబిరంలో చేరారు.
 

Jammu and Kashmir: 20 more Congress leaders quit the party in support of Ghulam Nabi Azad
Author
First Published Sep 3, 2022, 1:57 AM IST

జమ్మూ కాశ్మీర్: ఇప్పటికే కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. దీనికి తోడు చాలా కాలంగా నాయకత్వ లేమి ఆ పార్టీని మ‌రింత కుంగ‌దీస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి గులాం న‌బీ ఆజాద్ ఇటీవ‌లే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. అంత‌టితో ఆగ‌కుండా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కొత్త పార్టీ పెట్ట‌బోతున్నట్టు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నాయ‌క‌త్వానికి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌మ్మూకాశ్మీర్ కాంగ్రెస్ నాయ‌కుల రాజీనామాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఆ పార్టీని వీడ‌గా, గులాం నబీ ఆజాద్‌కు మద్దతుగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ-జమ్మూ నార్త్‌కు చెందిన మరో 20 మంది నాయకులు తమ రాజీనామాలను సమర్పించారు. 

సెప్టెంబర్ 4న కాంగ్రెస్‌ను వీడిన తర్వాత గులాం నబీ ఆజాద్ జమ్మూలో తన తొలి ర్యాలీని షెడ్యూల్ చేశారు. అదే రోజు రాహుల్ గాంధీ దేశ రాజధానిలో 'మెహంగై పర్ హల్లా బోల్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ కాంగ్రెస్ నాయకుడు తన సొంత పార్టీని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. మ‌రో 15 రోజుల్లోనే పార్టీ ఏర్పాటు సంబంధిత వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని ఆజాద్ స‌న్నిహితుడు జీఎం సరూరి పేర్కొన్నారు.  జమ్మూలోని సైనిక్ ఫామ్స్‌లో ఆజాద్ ఆదివారం ర్యాలీకి ముందు, జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్‌లో రాజీనామాల పరంపర జరిగింది. మాజీ ఉపముఖ్యమంత్రి తారా చంద్‌తో సహా మరో 64 మంది నాయకులు తమ రాజీనామాను సమర్పించి మంగళవారం గులాం నబీ ఆజాద్ శిబిరంలో చేరారు. ఇది  కేంద్ర పాలిత ప్రాంతంలోని జాతీయ పార్టీ యూనిట్‌ను స‌మూలంగా క‌ద‌లించిన‌ట్టైంది. మాజీ ముఖ్యమంత్రి జాతీయ పార్టీతో తన ఐదు దశాబ్దాల అనుబంధాన్ని ముగించిన తర్వాత వందలాది మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పంచాయతీ రాజ్ సంస్థ సభ్యులు, ప్రముఖ కార్య‌క‌ర్త‌లు తమ రాజీనామాలను సమర్పించారని సరూరి పేర్కొన్నారు.

ఇదిలావుండ‌గా, కాంగ్రెస్‌ను వీడిన తర్వాత గులాం నబీ ఆజాద్ సెప్టెంబర్ 4న జమ్మూలో తన తొలి ర్యాలీని షెడ్యూల్ చేశారు. అదే రోజు రాహుల్ గాంధీ దేశ రాజధానిలో 'మెహంగాయ్ పర్ హల్లా బోల్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆజాద్ ప్రారంభోత్సవ కార్యక్రమం రాహుల్ గాంధీ చేప‌ట్ట‌బోయే ర్యాలీతో సమానంగా ఉండటంతో, ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన మెగా ఈవెంట్‌లో మాజీ కాంగ్రెస్ చీఫ్ ప్రసంగించే  రోజు పొలిటిక‌ల్ హీట్ మరింత‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది. తన రాజీనామా లేఖ కేవలం "మంచు పర్వత కొన" అని గులాం న‌బీ ఆజాద్ పేర్కొన‌డం.. రాబోయే రోజుల్లో గాంధీలపై తన దాడిని మరింత ఉధృతంగా ఉంటుంద‌నే సంకేతాలు పంపారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జమ్మూ కాశ్మీర్‌లో తన సొంత పార్టీతోనే బ‌రిలోకి దిగ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌క‌టించారు. జమ్మూలోని సైనిక్ ఫామ్స్‌లో ఆజాద్ ఆదివారం ర్యాలీకి ముందు, జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్‌లో రాజీనామాల పరంపర కొన‌సాగుతూనే ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios