James Webb Space Telescope: నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తాజాగా మరో అద్భుతమైన చిత్రాన్ని విడుదల చేసింది. ఈ చిత్రంలో అత్యంత పురాతనమైన గెలాక్సీ ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గెలాక్సీ మెస్సియర్ 74 అని గుర్తించింది. దీనిని NGC 628 అని కూడా పిలుస్తారు
James Webb Space Telescope: మన విశ్వం అనంతమైనది. ఇందులో ఊహాకందని రహాస్యాలెన్నో ఉన్నాయి. ఈ విశ్వానికి ఆది ఎక్కడో అంతమెప్పుడో చెప్పడం చాలా కష్టం. ఈ తరుణంలో విశ్వ ఆవిర్భవ రహాస్యాలను తెలుసుకోవడానికి US స్పేస్ ఏజెన్సీ NASA తొలుత హబుల్ టెలిస్కోప్ ను ప్రయోగించింది. ఇది ఎన్నో గెలాక్సీలు, బ్లాక్ హోల్స్‌తో సహా అనేక అద్భుతమైన వస్తువుల చిత్రాలను ప్రపంచ మానవాళికి అందించింది.
విశ్వం గురించి మరింత లోతైనా అధ్యయనం అవసరమని భావించిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA అతిపెద్ద అంతరిక్ష టెలిస్కోప్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (James Webb telescope) ప్రయోగించింది. ఈ టెలిస్కోప్ తొలి ఫుల్ కలర్ ఫోటోని అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ NASA జూలై 12న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే
ప్రస్తుతం ఈ స్పేస్ టెలిస్కోప్(James Webb telescope) పంపుతున్న అద్భుతమైన చిత్రాలపై.. ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తల దృష్టి పడింది. అంతరిక్ష విషయాలపై ఆసక్తి ఉన్నవారికి జేమ్స్ వెబ్ చిత్రాలు మరింత థ్రిలింగ్ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.
తాజాగా ఈ టెలిస్కోప్ (James Webb telescope) మరో అద్భుతమైన చిత్రాన్ని విడుదల చేసింది. ఈ చిత్రంలో అత్యంత పురాతనమైన గెలాక్సీ ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గెలాక్సీ మెస్సియర్ 74 అని గుర్తించింది. దీనిని NGC 628 లేదా ఫాంటమ్ గెలాక్సీ అని కూడా పిలుస్తారు. దీన్ని 1780లో చార్లెస్ మెస్సియర్ కనుగొన్నారు.
James Webb telescope తన NIR కెమెరా (నియర్ ఇన్‌ఫ్రారెడ్ కెమెరా)ని ఉపయోగించి సుదూర గెలాక్సీ చిత్రాన్ని తీసింది. ఈ చిత్రంలో గెలాక్సీ చిన్న చిన్న నీలిరంగు నక్షత్రాలను కలిగి ఉంది. ఈ గెలాక్సీ నవంబర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రంలో బ్లాక్ హోల్ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. దీంతో శాస్త్రవేత్తలు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఈ గెలాక్సీకి సంబంధించిన అద్భుతమైన ఫొటోలను NASA శనివారం విడుదల చేసింది. నాసా తన బ్లాగ్ పోస్ట్‌లో బ్లాక్‌హోల్‌తో కలర్‌ఫుల్‌గా ఉన్న ఫాంటమ్ గెలాక్సీ ఫోటోలు ఆన్‌లైన్‌లో తెగ చక్కర్లుకొడుతున్నాయి
James Webb telescope మైలురాయి
విశ్వ అవిర్భ అన్వేషణ ఇదో ఓ మైలురాయిగా పరిగణించబడుతుంది. James Webb telescope టెలిస్కోప్ ఆవిష్కరణ వల్ల మొత్తం విశ్వాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అంచనా వేయబడింది. నాసా గత ఏడాది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ప్రయోగించింది. ఇటీవల ఈ టెలిస్కోప్ (James Webb telescope) తీసిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ గెలాక్సీ మనకు ఎంత దూరంలో ఉందంటే..
తాజాగా కనుగొన్న పాలపుంత మనకు దాదాపు 33 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉందని అంచనా. విశ్వం పరిమాణంలో వేగంగా విస్తరిస్తుంది. మొదటి గెలాక్సీలు ఎప్పుడు, ఎలా ఏర్పడ్డాయో ఖగోళ శాస్త్రవేత్తలు ఇంకా నిస్సందేహంగా సమాధానం ఇవ్వలేదు. ఇది ఖగోళ శాస్త్ర ప్రపంచంలో ఒక చమత్కారమైన ప్రశ్నగా మిగిలిపోయింది.
