Asianet News TeluguAsianet News Telugu

పందులతో జల్లికట్టు ..! పాల్గొన్న 12 పందులు, 45 మంది యువకులు !

సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు ఎంత ఫేమసో తెలిసిందే. అదే రాష్ట్రంలో మరో చోట పందులతో జల్లికట్టు నిర్వహిస్తారని తెలుసా?  వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది జరిగింది. అదీ తమిళనాడులోనే..

jallikattu competitions with pigs in tamilnadu - bsb
Author
Hyderabad, First Published Jan 20, 2021, 4:01 PM IST

సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు ఎంత ఫేమసో తెలిసిందే. అదే రాష్ట్రంలో మరో చోట పందులతో జల్లికట్టు నిర్వహిస్తారని తెలుసా?  వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది జరిగింది. అదీ తమిళనాడులోనే..

వివరాల్లోకి వెడితే.. తమిళనాడు లోని తేని జిల్లా అల్లినగరం ప్రాంతంలో నిర్వహించిన పందుల జల్లికట్టు పోటీలను పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. 

వల్లినగర్‌ ప్రాంతంలో కురువర్‌ వర్గానికి చెందిన 50కి పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా వన వేంగైగళ్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పందుల జల్లికట్టు నిబంధనలతో నిర్వహించారు.

ఈ పోటీల్లో 70 నుంచి 100 కిలోల బరువున్న పందులు మాత్రమే పాల్గొనాలి. తాటి మానులతో ఏర్పాటు చేసిన వడివాసన్‌ నుంచి పంది మూడడుగుల దూరం వెళ్లిన తర్వాతే దానిని పట్టుకోవాలి. 

చివరి లైన్‌ దాటేలోపు కేవలం పంది వెనుక కాళ్లు మాత్రమే పట్టుకొని దానిని ఆపాలి. అలా ఆపిన వారు విజేతలుగాను, పట్టుకోకుండా లైన్‌ దాటే పందిని విజేతగా ప్రకటిస్తారు. ఈ పోటీల్లో తేని, దిండుగల్‌, మదురై జిల్లాల నుంచి 12 పందుల రాగా, 45 మంది యువకులు పాల్గొన్నారు. 

ఈ వింత జల్లికట్టును వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై,  యువకులను ఉత్సాహపరిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios