జైపూర్:  రాజస్థాన్ రాష్ట్రంలోని సవాయి మాధోపూర్ ఎమ్మెల్యే దియా కుమారి విడాకుల కోసం ధరఖాస్తు చేసుకొన్నారు. దియా కుమారి జైపూర్  రాజ కుటుంబానికి  చెందిన యువతి.

హిందూ వివాహ చట్టం 13 బీ  సెక్షన్  కింద గాంధీ నగర్  ఫ్యామిలీ కోర్టులో  ఆమె విడాకుల కోసం ధరఖాస్తు చేసుకొన్నారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొంటున్నట్టు తన పిటిషన్ లో పేర్కొన్నారు. 

జైపూర్ మహారాజు భవానీ సింగ్ కుమార్తై దియా కుమారి. తొమ్మిదేళ్ల పాటు డేటింగ్ చేసి నరేంద్రసింగ్ ను దియా కుమారి 1997లో  వివాహం చేసుకొంది.  వీరికి ఓ కుమార్తై , ఇద్దరు కొడుకులు ఉన్నారు.  గత కొంత కాలంగా  భార్య భర్తల మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో  విడాకులు తీసుకోవాలని  నిర్ణయం తీసుకొన్నారు.  21 ఏళ్ల తర్వాత ఈ జంట విడిపోనుంది.

బీజేపీ నుండి సవాయి మాధోపూర్ నుండి దియా కుమారి ఎమ్మెల్యేగా విజయం సాధించింది.  ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో దియా కుమారి మాత్రం పోటీ చేయలేదు. వ్యక్తిగత కారణాలతోనే  తాను పోటీకి దూరంగా ఉన్నట్టుగా  దియా కుమారి ప్రకటించారు. ఆదియా స్థానంలో  ఆశా మీనా  అనే అభ్యర్థికి బీజేపీ టికెట్టు ఇచ్చింది.