Asianet News TeluguAsianet News Telugu

బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే.. గాయత్రీమంత్రం చదివిన రోగి...

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రిడ్మల్ రామ్ కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు. సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. బాధితుని మెదడులోని కీలకమైన ప్రాంతంలో ట్యూమర్ ఏర్పడింది. దీంతో బాధితునికి ఆపరేషన్ చేసే సమయంలో చిన్నపాటి పొరపాటు జరిగినా అతను మాట కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు గుర్తించారు. 

Jaipur : Patient chants mantras, reads newspaper as doctors remove tumour from brain
Author
Hyderabad, First Published Aug 11, 2021, 9:56 AM IST

రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక బాధితునికి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అత్యంత విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. ఆ వ్యక్తి స్పృహలో ఉంటూనే ఆపరేషన్ చేయించుకోవడం విశేషం. డాక్టర్ ఆపరేషన్ చేస్తుండగా బాధితుడు గాయత్రీ మంత్ర జపం చేశాడు. 

ఈ సర్జరీ సుమారు నాలుగు గంటలపాటు జరిగింది. ఈ ఆపరేషన్ కోసం హై ఎండ్ మైక్రోస్కోప్ వినియోగించారు. ఇది బ్రెయిన్ ఏరియాను మరింత దగ్గరగా చూసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇటువంటి ఆపరేషన్లు దేశంలోని ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో మాత్రమే చేస్తారు. 

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రిడ్మల్ రామ్ కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు. సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. బాధితుని మెదడులోని కీలకమైన ప్రాంతంలో ట్యూమర్ ఏర్పడింది. దీంతో బాధితునికి ఆపరేషన్ చేసే సమయంలో చిన్నపాటి పొరపాటు జరిగినా అతను మాట కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు గుర్తించారు. 

ఫలితంగా వైద్యులు.. బాధితుడిని స్పృహలో ఉంచుతూనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో వైద్యులు బాధితునితో తరచూ చేతివేళ్లను, పాదాలను కొద్దిగా కదిలిస్తూ ఉండాలని చెప్పారు. ఈ ఆపరేషన్ గురించి న్యూరో సర్జన్ డాక్టర్ కేకే బన్సాల్ మాట్లాడుతూ సాధారణంగా సర్జరీలు చేసేటప్పుడు బాధితునికి మత్తుమందు ఇస్తారు.

అయితే ఈ కేసులో బాధితుడిని స్పృహలో ఉంచే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. బాధితుడి ఆపరేషన్ చేస్తున్నంతసేపూ గాయత్రీ మంత్ర జపం చేస్తున్నారని తెలిపారు. కాగా డాక్టర్ బస్సాల్ 2018లోనూ ఇదేవిధంగా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios