Asianet News TeluguAsianet News Telugu

మెస్ ఫుడ్ విషయంలో వాగ్వాదం.. జైలు వార్డెన్ ను చితకబాదిన తోటి పోలీసులు.. అరెస్ట్...

మెస్ ఫుడ్ విషయంలో ఓ జైలు వార్డెన్ కు మిగతా సహచరులకు ఏర్పడ్డ వాగ్వాదం గొడవగా మారింది. దీంతో వారు జైలు వార్డెన్ ను చితకబాదారు. 

Jail Warden Beaten up by colleagues in uttarpradesh, 5 arrested
Author
First Published Dec 28, 2022, 10:41 AM IST

రాయ్‌బరేలి : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ జైలు వార్డెన్ ను అతని సహచరులు కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఈ ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెడితే.. జైలు వార్డెన్‌ను అతని సహచరులకు.. తమ క్యాంటీన్ వ్యాపారంపై ప్రభావం చూసేలా ఉన్న మెస్ ఫుడ్‌ విషయంపై వాగ్వాదం జరిగింది. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. దీంతో అతడిని ముగ్గురు సహచరులు కర్రలతో దారుణంగా కొట్టారు.

ఈ ఘటన అంతా జైలు బయట అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. జైలు మెస్ ఇన్‌ఛార్జ్ ముఖేష్ దూబేని అతని ముగ్గురు సహచరులు కర్రలతో కొట్టడం, మరో ఇద్దరు ఘర్షణను చూస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇతర జైలు వార్డెన్లు అతనిని చుట్టుముట్టి కర్రలతో కొరడాలతో కొట్టడంతో మిస్టర్ దూబే "ఇంకా కొట్టండి" అని అనడం కూడా వినిపిస్తుంది. ఆ తరువాత ఒక సమయంలో, అతను తిరగబడి తన సహోద్యోగులలో ఒకరి నుండి కర్రను లాక్కోవడానికి ప్రయత్నించాడు. కాని ముగ్గురు వ్యక్తులు అతనిని తీవ్రంగా కొట్టడం కొనసాగించారు.

పూర్తిస్థాయి నీటిమ‌ట్టంతో ముళ్లపెరియార్ డ్యామ్.. వరద హెచ్చరికలు జారీ చేసిన కేర‌ళ స‌ర్కారు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే, రాయ్ బరేలీ పోలీసులు, ట్విట్టర్ పోస్ట్‌పై స్పందిస్తూ, ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసి, డిపార్ట్‌మెంటల్ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. తమ క్యాంటీన్ విక్రయాలపై ప్రభావం చూపుతున్నందున మెస్‌లోని ఆహార నాణ్యతను దిగజార్చాలని ఒత్తిడి చేయడంతో తనకు, సహచరులకు మధ్య వాగ్వాదం జరిగిందని ముఖేష్ దూబే ఆరోపించారు. ముఖేష్ దూబే చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. నిందితులైన పోలీసులందరినీ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలోని జిల్లా జైలులో ఉంచారు.

Follow Us:
Download App:
  • android
  • ios