Bengal Assembly: ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గంద‌ర‌గోళం నెల‌కొంది. మమతా బెనర్జీ ప్రసంగం సమ‌యంలో బీజేపీ ఎమ్యెల్యేలు "జై శ్రీ రామ్" అని నినాదిస్తే.. అందుకు బ‌దులుగా మ‌మ‌తా బెన‌ర్జీ పార్టీ ఎమ్మెల్యేలు  "జై బంగ్లా" అంటూ నినాదాలు చేశారు. అనంత‌రం బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి..అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.  

Bengal Assembly: ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీజేపీకి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. తొలుత ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రిమమతా బెనర్జీ తన ప్రసంగంలో బిజెపిని లక్ష్యంగా చేసుకుని, దేశంలో బీజేపీ అంతం కాబోతుంద‌నీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపేత‌ర పార్టీ అధికారంలోకి వ‌స్తుందని విమ‌ర్శించారు.దీంతో ఒక్క‌సారిగా.. అసెంబ్లీ హీటెక్కింది. వెంట‌నే స‌భలో ఉన్న‌.. ప్ర‌తిప‌క్ష బీజేపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము 200 పైగా సీట్లు గెలుచుకుంటామ‌నీ, ఈసారి రాష్ట్రంలో ఎస్పీ తుడిచి పెట్టుకపోతుంద‌ని విమ‌ర్శించారు. దీంతో ఇరు పార్టీ మ‌ధ్య గందరగోళం నెల‌కొంది. ఇరు ప‌క్షాల నేత‌ల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇవ్వడం లేదని బెనర్జీ ఆరోపించారు. విప‌త్క‌ర ప‌రిసిత్థుల్లో కూడా కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ క్ర‌మంలో ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఇద్దరు ఎమ్మెల్యేల సస్పెన్షన్ చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం, నిరసనలు చేయడంతో అసెంబ్లీలో హై డ్రామా నెలకొంది. బడ్జెట్ సెషన్‌లో గవర్నర్ ప్రసంగం సమయంలో గందరగోళం, అవాంతరాలు కలిగించారనే ఆరోపణలు చేయ‌డంతో సెషన్ ప్రారంభంలోనే బిజెపి ఎమ్మెల్యేలు మిహిర్ గోస్వామి, సుదీప్ ముఖోపాధ్యాయలను స్పీకర్ విమాన్ బెనర్జీ స‌స్పెండ్ చేశారు.
 బీజేపీ ఎమ్యేల్యేల సస్పెన్షన్‌కు వ్యతిరేకిస్తూ..ఎమ్మెల్యేలు సుభేందు అధికారి నేతృత్వంలో బీజేపీ నేత‌లు వాకౌట్ చేశారు. ఈ త‌రుణంలో బీజేపీ ఎమ్మెల్యేలు "జై శ్రీరాం" నినాదాలు చేస్తే.. ముఖ్యమంత్రి పార్టీ నేత‌లు "జై బంగ్లా అంటు నినాదాలు చేశారు. అప్పుడు బిజెపి ఎమ్మెల్యేలు బదులుగా "జై సియా రామ్" అని నినదించారు. 

ఇదిలా ఉంటే.. అంత‌కు ముందు రోజు.. మ‌మ‌తా బెనర్జీకి విమాన ప్ర‌మాదం త‌ప్పింది. తాను ప్రయాణిస్తున్న విమానం తీవ్ర కుదుపుల‌కు గురైంద‌ని.. స్వ‌యంగా మ‌మ‌తా బెన‌ర్జీ నే సంచ‌ల‌న ప్ర‌క‌టన చేసింది. ఆమె సోమ‌వారం అసెంబ్లీ వ‌ద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. తాను ప్ర‌యాణిస్తున్న చార్ట‌ర్డ్ ఫైట్ కి ఎదురుగా మ‌రో విమానం వ‌చ్చింద‌న్నారు. త‌న ఫైల‌ట్ చాక‌చాక్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో.. పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని అన్నారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడినట్లు మమత చెప్పారు. విమానం గురించి ఏటీసీ, డీజీసీఏ నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు.

గత శుక్రవారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసిలో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లిన మమతా బెనర్జీ... ఆరోజు సాయంత్రం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాన‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో అకస్మాత్తుగా మరో విమానం త‌న‌ విమానం ఎదురుగా వచ్చిందనీ, దీంతో విమానం భారీ కుదుపులకు గురైందని తెలిపారు. మ‌రో ప‌ది సెక‌న్లు ఇలాగే సాగితే రెండు విమానాలు ఢీకొనేవ‌ని మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. తాము ప్ర‌యాణిస్తున్న విమానం ఆరు వేల అడుగున వెళుతుంద‌న్నారు. కానీ పైల‌ట్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి ప్ర‌మాదాన్ని త‌ప్పించార‌ని చెప్పారు. వెంట‌నే విమానాన్ని నేతాజీ సుభాష్ చంద్ర అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమ‌ర్జెన్సీ లాండ్ చేశాడు పైలట్. ఈ ప్ర‌మాదంలో త‌న వెన్న‌ముక‌కు, ఛాతీకి గాయాల‌య్యాయ‌ని తెలిపారు. ఇప్ప‌టికీ నొప్పిగా ఉంద‌న్నారు.