Jahangirpuri clash:ఢిల్లీలో జరిగిన జహంగీర్‌పురి ఘర్షణ అంతర్జాతీయ కుట్రలో భాగమని బీజేపీ నేత, వాయువ్య ఢిల్లీ ఎంపీ హన్స్ రాజ్ హన్స్ వ్యాఖ్యానించారు. భారత్‌ను అప్రతిష్ఠపాలు చేయడమే విదేశీ శక్తుల లక్ష్యమని అన్నారు. దేశంలో నివసిస్తున్న కొంతమంది వ్యక్తులు విదేశీ శక్తులకు సాయమందిస్తున్నాయని ఆరోపించారు. 

Jahangirpuri clash: ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వ‌హించిన ఊరేగింపు హింసాత్మకంగా మారింది. కొందరు దుండగులు ర్యాలీపై రాళ్లతో దాడి చేశారు. దాంతో హింస చెలరేగింది. వాహనాలను నిప్పు కూడా పెట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను ఆపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు గాయాలయ్యాయి. తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ నేప‌థ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు 20 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు ఢిల్లీలో ఘర్షణల నేపథ్యంలో నోయిడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

'అంతర్జాతీయ కుట్ర'

ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జహంగీర్‌పురి ఘర్షణ అంతర్జాతీయ కుట్రలో భాగమని బీజేపీ నేత, వాయువ్య ఢిల్లీ ఎంపీ హన్స్ రాజ్ హన్స్ వ్యాఖ్యానించారు. అంత‌ర్జాతీయంగా భారత్‌ను అప్రతిష్ఠపాలు చేయడమే విదేశీ శక్తుల లక్ష్యమని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ దాడికి దేశ అంత‌ర్భాగం లో నుంచే విదేశీ శక్తులకు సాయమందిస్తున్నాయని ఆరోపించారు. ముందస్తు ప్రణాళికతోనే ఈ కుట్ర జ‌రిగింద‌నీ, భారత్‌ను అపకీర్తిపాలు చేయడమే వారి లక్ష్యమ‌ని ఆరోపించారు. ఈ ఘటన విషయంలో ఏ మతాన్నీ నిందించలేం. ఈ ఘటనపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలి’ అని పేర్కొన్నారు. కాగా ఎంపీ హన్స్ రాజ్ వాయువ్య ఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

విచారణ కొనసాగుతోంది

ఈ ఘటనపై దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని పోలీసులు ఆదివారం వెల్లడించారు. శనివారం హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా కత్తులు, తుపాకులు ఝుళిపిస్తున్న వీడియోల గురించి అడిగినప్పుడు, పోలీసు అధికారి దీపేంద్ర పాఠక్, “మా వద్ద విజువల్స్, CCTV ఫుటేజీలు ఉన్నాయి. విచారణ కొనసాగుతోంది. తదుపరి చర్యలు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 20 మందిని అరెస్టు చేశారు. ఘర్షణ సమయంలో.. కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు మైనర్ అని అతని కుటుంబం పేర్కొంది. అత‌డి అరెస్టుకు వ్య‌తిరేకిస్తూ.. నిర‌స‌న‌గా పోలీస్ స్టేష‌న్ ఎదుట బైటాయించారు. పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం అతడి వయసు 22 ఏళ్లు అని న‌మోదు చేసిన‌ట్టు ఆరోపించారు. తమ పిల్లవాడు 2005లో జన్మించాడని చెబుతున్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం అతడి వయసు 26 ఏళ్లుగా నమోదుచేశారు. మరొక నిందితుడైన అన్సార్‌ జహంగీర్‌పురి ఏరియాలో ముస్లిం నాయకుడని, అతనిపై ఇప్పటికే దాడులు, గ్యాంబ్లింగ్‌ నేరారోపణల కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. నిందితులను వైద్య పరీక్షలకు తీసుకెళ్తుండగా, వారి కుటుంబ సభ్యులు ఠాణా ఎదుట ఆందోళనకు దిగారు.


 శాంతి సమావేశం

మత ఘర్షణల తర్వాత శాంతి భద్రతలను పెంపొందించేందుకు పోలీసులు ఆదివారం జహంగీర్‌పురి, మహేంద్ర పార్క్, ఆదర్శ్ నగర్ ప్రాంతాలకు చెందిన అమన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. శాంతి, ప్రశాంతతను కాపాడేందుకు, PS జహంగీర్‌పురి ప్రాంతంలోని కుషాల్ చౌక్‌లో DCP నార్త్ వెస్ట్, PS జహంగీర్‌పురి, PS మహేంద్ర పార్క్, PS ఆదర్శ్ నగర్‌ల అమన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించమ‌ని నార్త్-వెస్ట్ DCP ఉష తెలిపారు. 

బీజేపీ నేతల సందర్శన

ఢిల్లీ బీజేపీ నేతలు ఆదేశ్ గుప్తా, రాంవీర్ సింగ్ బిధూరి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జహంగీర్‌పురిని సందర్శించి పరిస్థితిని పరిశీలించి, మత హింస బాధితులను శనివారం కలుస్తారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. అలాగే.. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి పునరావృతం కాకుండా.. త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.