న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు పెంచలేదని ఆదాయపన్ను శాఖ ఖండించింది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచినట్టుగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని  ఐటీ శాఖ స్పష్టం చేసింది.

 2018-19  సంవత్సరానికి  రిటర్నులు సమర్పించేందుకు ఆగష్టు 31వ తేదీతో ముగుస్తోందని ఐటీ శాఖ ప్రకటించింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువును పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొందని సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని సీబీడీటీ ఖండించింది.

ఈ మేరకు సీబీడీటీ శుక్రవారం నాడు ట్వీట్ చేసింది. గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 31. అయితే ఆగష్టు 31వ తేదీ సమయం ఇచ్చిన విషయాన్ని సీబీడీటీ గుర్తు చేసింది.