సినిమాల్లో ఐటెం సాంగ్స్, పోర్న్ కంటెంట్ కారణంగానే దేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయంటూ ఆర్జేడీ నేత శివానంద్ తివారీ సంచలన కామెంట్స్ చేశారు. జార్ఖండ్‌లోని దుమ్కా ప్రాంతంలో 35 ఏండ్ల మ‌హిళపై 17 మంది సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన సంఘటన తెలిసిందే.  భర్త కళ్లెదురుగానే.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా.. ఈ ఘటన నేపథ్యంలోనే శివానంద్ తివారీ ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం.

గిరిజ‌న ప్రాంతంలో ఒక మ‌హిళ‌పై అత్యాచారం జ‌రుగుతుంద‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌ర‌ని, ఎందుకంటే గిరిజ‌న సంప్ర‌దాయంలో అత్యాచారం అనే ప‌దానికి చోటులేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రానురాను ఆధునీక‌ర‌ణ‌లో భాగంగా విన‌యోగారు సంప్ర‌దాయం మొద‌లైంద‌ని, ఈ వినియోగదారు సంప్ర‌దాయంలో మ‌హిళ‌లు వినియోగ వ‌స్తువులుగా మారిపోయారని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

జార్ఖండ్ లో అత్యాచారాలు పెరగడానికి మొబైల్ ఫోన్లలో అశ్లీల దృశ్యాలు లభించడమే కారణమని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు
ప్ర‌స్తుతం మొబైల్ ఫోన్‌ల‌లో ల‌భిస్తున్న‌ ఐట‌మ్ డ్యాన్స్‌లు, అస‌భ్య‌క‌ర ప్ర‌క‌ట‌న‌లు, అశ్లీల వీడియోలు జ‌నాల్లో రేపిస్ట్ మ‌న‌స్త‌త్వాల‌ను ప్రేరేపిస్తున్నాయ‌ని చెప్పారు. క‌ఠిన చ‌ట్టాలు చేసినంత మాత్రాన ఈ అత్యాచారాలు ఆగ‌వ‌న్నారు. ప్ర‌జ‌ల‌ను అత్యాచారాల‌కు ప్రేరేపించే ప‌రిస్థితులు కొన‌సాగినంత కాలం ఈ అత్యాచారాల‌ను ఆప‌డం సాధ్యం కాద‌ని శివానంద్ తివారీ వ్యాఖ్యానించారు.