ముంబై: మహారాష్ట్ర చరిత్రలో ఇది బ్లాక్ డే అని కాంగ్రెస్ అన్నది. కాంగ్రెస్  పార్టీలో  ఉన్న నేతలు అహ్మద్  పటేల్, కే‌.సి. వేణు గోపాల్, మల్లిఖార్జున్ ఖర్గే కలిసి ప్రేస్ మీట్ నిర్వహించారు.

శివసేన, ఎన్సీపీల సంయుక్త ప్రెస్ మీట్ అయిపోగానే కాంగ్రెస్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించింది. తమ ఎమ్మెల్యేలంతా తమవైపే ఉన్నారని వారన్నారు. నిన్న సాయంత్రం మూడు పార్టీల మీటింగ్ చాలా బాగా జరిగిందని అన్నారు. 

మహారాష్ట్ర రాష్ట్ర చరిత్రలో ఇది బ్లాక్ డే అని అన్నారు. మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ వైపు నుంచి జరిగిన జాప్యం వల్లే మహా వికాస్ అగాది పురుడు పోసుకోలేకపోయిందని ఉదయం అభిషేక్ మను సింగ్వి ట్వీట్ చేసాడు. 

కాంగ్రెస్ సీనియర్ నేత ఈ ట్వీట్ చేయడంతో, అక్కడ ఉన్న విలేఖరులు ఈ ప్రశ్నను అడిగారు. దానికి అహ్మద్ పటేల్ సమాధానమిస్తూ, తమ తరుపు నుంచి ఎటువంటి జాప్యం జరగలేదని అన్నారు. 

ఇలా గుట్టుచప్పుడు కాకుండా, ప్రమాణ స్వీకారం చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దొంగలవలె రాత్రిపూట ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని అన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగస్ఫూర్తి తిలోదకాలు ఇవ్వడమేనని వారు అభిప్రాయపడ్డారు. 

గవర్నర్ ఇలా వారితోనే ప్రమాణస్వీకారం చేయించడం కరెక్ట్ కాదని వారు అభిప్రాయపడ్డారు.