Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయమొచ్చింది: జేపీ నడ్డా

తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు త్వరలోనే వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ (వీఆర్ఎస్) ఇచ్చే సమయమొచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.  

It's time to give VRS to BRS: JP Nadda
Author
First Published Dec 15, 2022, 10:30 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు త్వరలోనే వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ (వీఆర్ఎస్) ఇచ్చే సమయమొచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణలో  ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా గురువారం కరీంనగర్ లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ బహిరంగ సభకు జేపీ నడ్డా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'వేములవాడ రాజన్నకు ప్రణామాలు, కొండగట్టు అంజన్నకు ప్రణామాలు' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ధనిక రాష్ట్రం తెలంగాణాను  సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చివేశారని ఆరోపించారు. అందికాడికి దోచుకోవడం, దాచుకోవడమే కేసీఆర్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, సీఎం కేసీఆర్ పాలన అంతా అవినీతి, అక్రమాల మయమైందని విమర్శలు గుప్పించారు. సీఎంకేసీఆర్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కేసీఆర్‌కు విశ్రాంతి ఎంతో అవసరమన్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దెదించే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు.

కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ త్వరలోనే వీఆర్ఎస్ ఇచ్చే సమయమొచ్చిందని ఎద్దేవా చేశారు. ఒక దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని నడ్డా ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేసీఆర్‌కు కుటుంబ పాలన తప్ప ప్రజా సంక్షేమం గురించిన ఆలోచన ఉండదని అన్నారు. బీజేపీ మాత్రమే కీసీఆర్‌ను గద్దె దించగలదని నడ్డా అన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం మాత్రమేనని, ఈ యాత్ర ఆగదని నడ్డా స్పష్టం చేశారు. ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభమవుతోందని వెల్లడించారు.  తెలంగాణకు తొలి సీఎంగా ఓ దళితుడిని  చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ కు కుటుంబ పాలన తప్ప ప్రజాసంక్షేమం గురించి ఏ మాత్రం పట్టింపు లేదని, ప్రజా సంక్షేమం గురించి ఆలోచన లేదని అన్నారు. గడీల పాలన అంతం కావాలంటే.. కేసీఆర్ ను గద్దె దించగలదని పేర్కొన్నారు.
 
బీజేపీ అధినేత కేసీఆర్‌కు కోపం రావచ్చు. అయితే ఏజెన్సీలు అతని కుమార్తెను ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. 'ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్' కేసులో కేసీఆర్ కుమార్తె కవిత హస్తముందనీ. అందుకు ఆమెను సీబీఐ ఇటీవల ప్రశ్నించిందని అన్నారు. కవిత. కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని నడ్డా ఆరోపించారు. తన మంత్రులు కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, దళితులకు భూపంపిణీ, నిరుద్యోగ భృతి తదితర ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంధుప్రీతి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios