బీజేపీ మాజీ ఎంపీ, బాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు  శతృఘ్నసిన్హా బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారా...? అవుననే సమాధానమే వినపడుతోంది. ఈ వారంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. 

శతృఘ్నసిన్హా బీజపీలో కొనసాగుతున్నప్పటికీ.. నిత్యం సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ ఉండేరు. ఎప్పుడూ బీజేపీకి తలనొప్పి పనులు తెచ్చిపెడుతూ ఉండేవారు. అలాంటి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరేందకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని బీహార్ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. 

శతృఘ్నసిన్హా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు గత కొన్నాళ్లుగా పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నెల 28 లేదా 29 తేదీల్లో శతృఘ్నసిన్హా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు అఖిలేష్ ప్రసాద్ సింగ్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు బీజేపీ సర్కారుపై తరచూ విమర్శల వర్షం కురిపించిన శతృఘ్నసిన్హాకు బీజేపీ పాట్నా సాహిబ్ టికెట్ ఇవ్వలేదు. 

శతృఘ్నసిన్హా సిట్టింగ్ స్థానమైన పాట్నాసాహిబ్ ను కేంద్రమంత్రి రవిశంకరప్రసాద్ కు కేటాయించింది. దీంతో శతృఘ్నసిన్హా తాజాగా కాంగ్రెస్ యుక్త భారత్ కు సమయం వచ్చిందని ట్వీట్ చేశారు. శతృఘ్న తాజాగా చేసిన ట్వీట్ తో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సూచికగా భావించవచ్చంటున్నారు కాంగ్రెస్ నాయకులు.